విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ బండబడ.. ఇసుక తరలింపు అడ్డుకుంటే.. స్కూల్‌కు వెళ్లొద్దా..? విజయనగరంలో ఇలా..

|
Google Oneindia TeluguNews

చదువుకు ఇసుక తరలింపుకు ముడిపెట్టారు. ఇంకేముంది మరో గ్రామంలో గల విద్యార్థులకు బడి దూరం కానుంది. ఈ ఘటన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఇరు గ్రామస్తుల గొడవతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మొహరించారు. ప్రస్తుతం సిచుయేషన్ కంట్రోల్‌లోనే ఉందని.. ఖాకీలు చెబుతున్నారు.

ఇసుక పంచాయతీ

ఇసుక పంచాయతీ

విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయితీ ఉద్రిక్తతకు దారి తీసింది. పక్క గ్రామానికి చెందిన విద్యార్ధులు తమ ఊరి బడిలో చదవటానికి వీలు లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. పూసపాటిరేగ మండలంలో గల రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలొకొంది. లంకలపాలెం సమీపంలో ఉన్న తంగవలస గడ్డ నుంచి గోవిందపురం వాసులు ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జగన్నన ఇళ్ల నిర్మాణానికి ఈ ఇసుకను ఉపయోగిస్తున్నారు. ఇదీ కామనే.. కానీ వారిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది.

తరలింపు..

తరలింపు..

అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని లంకలపాలెం వాసులు ఆరోపించారు. ఈ మేరకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుక తరలింపుతో గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం ఇసుక తరలిస్తున్న వాహనాలను లంకలపాలెం వాసులు అడ్డుకున్నారు. వివాదం పెరిగి పెద్దదయ్యింది. లంకలపల్లికి చెందిన విద్యార్ధులు గోవిందపురంలోని స్కూలులో చదువుతున్నారు. వారు మంగళవారం స్కూలుకు వెళ్దామని ప్రయత్నం చేయగా గోవిందా పురం వాసులు వారిని అడ్డుకున్నారు.

నో స్కూల్

నో స్కూల్


తమను ఇసుక తరలించకుండా అడ్డుకున్నందుకు లంకలపల్లికి చెందిన విద్యార్ధులు తమ ఊరి స్కూల్‌లో చదవడానికి వీల్లేదంటూ లంకలపాలెం విద్యార్థులను గోవిందపురం వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. రెండు గ్రామాల మధ్య పోలీసు బలగాలను మోహరించారు.

 చదువుపై ప్రభావం

చదువుపై ప్రభావం

గ్రామాల మధ్య ఇసుక తరలింపు బడి వరకు వచ్చింది. చిన్నారుల చదువుపై ప్రభావం చూపించనుంది. ఇసుక తరలింపు అంశంపై మాట్లాడి.. నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ అలా చేయలేదు. దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

English summary
village objection on students education. sand transport is two village problem. incident happen at vizianagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X