అమెరికాకు చెందిన భారత వైద్యుడి అరెస్టు

USA
అమెరికాలోని భారత వైద్యుడు పంచపకేషన్ కలంబూర్ విశ్వనాథన్‌ను హైదరాబాద్ నేరపరిశోధన విభాగం (సిఐడి) పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. విశ్వనాథన్‌పై ఇంటర్ పోల్ లుకవుట్ నోటీసు జారీ అయింది. అతన్ని సిఐడి చెన్నైలో అరెస్టు చేసింది. పాల్ గ్యాస్ కుంభకోణంలో అతను నిందితుడు. ఇంటర్ పోల్ లుకవుట్ నోటీసు జారీ చేసిన పదేళ్ల తర్వాత విశ్వనాథన్‌ను పట్టుకోలిగినట్లు సిఐడి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉమాపతి చెప్పారు. అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా విశ్వనాథన్‌ను చెన్నైలో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

వెల్లూరుకు చెందిన విశ్వనాథన్ అమెరికాలోని జార్జియాలో ఉంటున్నాడు. చాట్స్‌వర్త్‌లోని ముర్రే కల్లోవే కౌంటీ ఆస్పత్రిలో అతను పనిచేస్తున్నాడు. పాల్ గ్యాస్ రిఫైనరీ డైరెక్టర్లలో డాక్టర్ విశ్వనాథన్ ఒకడని, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విశ్వనాథన్ పాల్ గ్యాస్ కుంభకోణంలో మరో ఇద్దరు ఎన్నారైలతో పాటు నిందితుడని, పదేళ్ల క్రితం ఆ కంపెనీ 9 కోట్ల రూపాయలు వసూలు చేసి వంటగ్యాస్ డీలర్‌షిప్ పొందడానికి ప్రయత్నించారని, అది జరగకపోవడంతో ప్రధాన నిందితుడు కృష్ణమూర్తి అరెస్టయ్యాడని పోలీసులు చెప్పారు. తన తల్లి అంత్యక్రియలకు వచ్చిన విశ్వనాథన్ సిఐడికి దొరికిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+