వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవయాని కేసు: సంగీతను అప్పగింతకు యూఎస్ ఓకె!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని భారత మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడె సహాయకురాలు సంగీతా రిచర్డ్‌ను భారతదేశానికి పంపించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అమెరికా దౌత్య శాఖ నుంచి ఇందుకు సంబంధించిన సందేశాలు దేవయాని కోబ్రాగాడెకు అందినట్లు సమాచారం. టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఈ సందేశంలో సంగీతా రిచర్డ్‌ను భారతదేశానికి అప్పగించేందుకు భారత అధికారులను అమెరికా అధికార వర్గాలు కోరాయి.

ప్రస్తుతం సంగీతా రిచర్డ్, ఆమె కుటుంబ సభ్యులు అమెరికా అధికారుల రక్షణలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా దేవయాని కోబ్రాగాడె పట్ల అమెరికా అధికారులు, పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్, న్యూఢిల్లీలోని అమెరికన్ రాయబార క్లబ్ అయిన అమెరికన్ కమ్యూనిటీ సపోర్ట్ అసోసియేషన్ (ఏసిఎస్ఏ)ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Devyani Khobragade

అంతేగాక దేవయాని కేసులో అమెరికా వైఖరిని నిరసిస్తూ అమెరికాపై ఒత్తిడి తెచ్చే అనేక కార్యక్రమాలను కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల భారత ప్రభుత్వం దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలకు కల్పించబడిన ప్రత్యేక సౌకర్యాలను కూడా రద్దు చేసింది.

అంతేగాక దేశంలోని అమెరికా దైత్య అధికారుల గుర్తింపు కార్డులను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధికారులు సంగీతా రిచర్డ్‌ను భారతదేశానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

English summary
The US government had initially agreed to deport Devyani's domestic help Sangeeta Richard to India, reveals emails exchanged between Indian diplomat Devyani Khobragade and the US state department wing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X