దారుణం: అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ గ్రాసరీ స్టోర్‌లో జరిగిన దోపిడీలో పంజాబ్‌కు చెందిన ధరమ్‌ప్రీత్ సింగ్ జస్సెర్(21) దుండగుల చేతిలో మరణించాడు.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ గ్రాసరీ స్టోర్‌లో జరిగిన దోపిడీలో పంజాబ్‌కు చెందిన ధరమ్‌ప్రీత్ సింగ్ జస్సెర్(21) దుండగుల చేతిలో మరణించాడు.
మూడేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లిన ధరమ్‌ప్రీత్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఇతడు ఫ్రెస్నోలోని ఓ గ్రాసరీ స్టోర్‌లో రాత్రి పూట పార్ట్‌టైం జాబ్ కూడా చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి ధరమ్‌ప్రీత్ విధుల్లో ఉండగా ఘోరం జరిగిపోయింది. హఠాత్తుగా ఓ నలుగురు దుండగులు గ్రాసరీస్టోర్‌లోకి ప్రవేశించారు. వారి చేతుల్లో గన్‌లను చూసిన ధరమ్‌ప్రీత్.. క్యాష్ కౌంటర్ కింద దాక్కున్నాడు.
కొన్ని వస్తువులను, డబ్బులను దోచుకుని వెళ్తూ వెళ్తూ.. ఆ దుండగుల్లో ఒకడు ధరమ్‌ప్రీత్‌ను దారుణంగా కాల్చేశాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ధరమ్‌ప్రీత్ చనిపోయాడు. కాల్పుల గురించి సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఆ గ్రాసరీ స్టోర్ వద్దకు చేరుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనంతరం గ్రాసరీ స్టోర్‌లో సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. స్టోర్ లోకి ప్రవేశించిన నలుగురు దుండగుల్లో ఒకరు భారతీయుడేనని పోలీసుల పరిశోధనలో వెల్లడైంది.
ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ఒకరైన అర్మిత్‌రాజ్ సింగ్ అత్వాల్(22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ధరమ్‌ప్రీత్ సింగ్ జస్సెర్ హత్య గురించి తెలుసుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ట్విటర్లో స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ ను ఆయన కోరారు.
-
నిప్పులు కురిసే జలపాతం.. ప్రకృతి సృష్టించిన మాయాజాలం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications