ఆస్ట్రేలియాలో నాయని: పెట్టుబడుల వేట

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రి శ్రీ నాయనినరసింహ రెడ్డి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన తన ప్రతినిధులు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి శ్రీ. మహమ్మద్. అజమ్ అలీ గారు, టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు శ్రీ. సంతోష్ గుప్తాలతో న్యూసౌత్‌వేల్స్ పార్లమెంట్ను సందర్శించారు.

ఈ మేరకు వారు న్యూ సౌత్వేల్స్ పాలక పార్టీ సాంస్కృతికశాఖ మంత్రి, ఎంపీ, పార్లమెంటు సభ్యుడు శ్రీ, రే విల్లియమ్స్ తో ఆయన భేటీ అయ్యారు, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించడానికి ఉన్న అవకాశాలను, ఆ దేశ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారంపై చర్చించరు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల కోసం నైపుణ్యం గల మానవ వనరులు, అంతరాయం లేని విద్యుత్తు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి నాయని వివరించారు.పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ.కె.సి.ఆర్ గారు ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమన్, ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు.

 దాంతో 15 రోజుల్లోనే అనుమతులు

దాంతో 15 రోజుల్లోనే అనుమతులు

టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని మంత్రి నాయని నర్సింహా రెడ్డి అన్నారు. టీహబ్ టాస్క్ మొదలగువంటి ప్రభుత్వ సంస్దలు క్వాలిటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడంలో ఎంతో తోడ్పడుతున్నాయని ఇన్వెస్టర్స్‌కి వివరించారు. తెలంగాణలో ఉన్న ప్రతిభ నేడు ప్రపంచానికి అవసరం అని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్, అలాగే పరిశ్రమల మంత్రి కెటిఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదలలతో నేడు తెలంగాణ భారత దేశం లోనే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌లో అలాగే అభివృద్ధి లోకూడా ప్రథమ స్థానంలో ఉన్నదని వివరించారు. ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఐతే తెలంగాణా భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని గుర్తుచేశారు. రే విల్లియమ్స్ మొమెంటోతో సత్కరించి తెలంగాణ రావాల్సిందిగా కోరారు ఈమేరకు వారు గ్లేడిస్ బేరేజిక్లియాన్ - ప్రీమియర్ అఫ్ న్యూ సౌత్వేల్స్పాలక తెలంగాణ పర్యటనకు ఆహ్వానించారు.

 ఆ తర్వాత ఇలా...

ఆ తర్వాత ఇలా...

నాయని నర్సింహా రెడ్డి ప్రతిపక్ష నేత, ఎపి జోడి మాకేయ్, ఎంపి జూలియా ఫిన్ , ఎంపి హ్యూ మక్డరోయ్త్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు వారికీ తెలంగాణ ఏ విధంగా సాధించామనే విషయాన్ని చెప్పారు. కేవలం మూడున్నర ఏళ్లలో ఎంతో ప్రగతి ని సాధించి భారత దేశంలో ముందుకు దూసుకుపోతున్నామని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ వారి కంపెనీలను స్థాపిస్తే వారు కూడా కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వివరించారు. ఐతే ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రెండో టియర్ సిటీ పాలసీ / రురల్ పాలసీ ఇతరపట్టణాలల్లో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరపున అనేక అదననపు పారితోషికాలు లభిస్తాయని వాణిజ్య వేత్తలకు వివరించారు, ప్రతిపక్ష నేత ఎంపి జోడి మాకేయ్ నాయని నరసింహ రెడ్డికి పార్లమెంట్ నుంచి జ్ఞాపిక బహుకరించారు.

 ఆ తర్వాత పార్లమెంటు సందర్శన

ఆ తర్వాత పార్లమెంటు సందర్శన

తరువాత వారు పార్లమెంటును సందర్శించి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటు అనుసరిస్తున్న విధానాన్ని, సమావేశాల నిర్వహణ గురించి నాయని నర్సింహారెడ్డి అధ్యయనం చేశారు ఆయనతో పాటు ఆస్ట్రేలియన్ ఎన్నారైలు అశోక్, అనిల్ మునగాల, రామ్ గుమ్మడివాలి, గోవెర్దన్ , సుమేషు రెడ్డి , వాసు తాట్కూర్ ప్రశాంత్ కడపర్తి వినోద్ ఏలేటి, ప్రమోద్ ఏలేటి, కపిల్ కాటిపెల్లి, అరుణ చంద్ర, డ్ర్.యదు సింగ్ తదితరులు ఉన్నారు

 తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయనినరసింహ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియాలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు, గ్లోబల్ టెక్నాలజీ, ఆపిల్, గూగుల్ లాంటి సంస్థలను హైదరాబాద్కు టీ ఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చామని గుర్తుచేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త టెక్నాలజీలను అమలు పర్చడంలో ముందుందని తెలిపారు.

 వసతులు చాలా ఉన్నాయి..

వసతులు చాలా ఉన్నాయి..

రాష్ట్రంలో పరిశ్రమల కోసం నిపుణులైన మానవ వనరులు, అంతరాయం లేని విద్యుత్తు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమన్, ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు. కొత్తగా 500 పరిశ్రమలకు భూకేటాయింపులు చేశామని ప్రకటించారు. తొలిదశలో 8,200 ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్ టైల్ పార్కు, సిరిసిల్ల అప్పారెల్ పార్కు తో పాటు నిజామాబాద్, గద్వాల, ఖమ్మం, సంగారెడ్డిలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.

 తెలంగాణ పోలీసు శాఖ భేష్

తెలంగాణ పోలీసు శాఖ భేష్

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకొంటున్నట్లు నాయనినరసింహ రెడ్డి వెల్లడించారు, శాంతిభద్రతల్లో నూతన సాంకేతిక విధానాన్ని అమలుచేస్తుండటం, షీ టీమ్స్ ద్వారా మహిళలకు భరోసా ఇవ్వడం , అత్యున్నత సాంకేతిక పరికరాలతో సిబ్బంది విధులు నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ నుండి భారీ ఎత్తున పోలీస్ శాఖకు నిధులు కేటాయించడం, ఆధునిక పద్ధతుల ద్వారా నేర నిర్ధారణ, సాక్ష్యాల సేకరణ, నేరం జరగ కుండా వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, మూడేండ్లలో నూతన వాహనాలు, కొత్త భవనాలు, అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం లాంటి చర్యలతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి పోలీసు స్టేషన్లకు నూతన వాహనాలను అందచేశామని నాయని నర్సింహారెడ్డి చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ శాఖ ప్రస్తుతం 70 శాతం సఫలమైందని, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వ్యాపారవేతలను హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు,.

 తోటి సభ్యులకు ప్రోత్సాహం ఇవ్వాలి...

తోటి సభ్యులకు ప్రోత్సాహం ఇవ్వాలి...

పారిశ్రామిక ప్రగతికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని, ఈ దృష్ట్యా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ తోటి సభ్యులను ప్రోత్సహించాలని తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం (టీబీసీఫ్) ప్రతినిధులకు హెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు, హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, దేశ, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేవని అన్నారు. టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి - శ్రీ. మహమ్మద్. అజమ్ అలీ తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకొంటున్నారని అన్నారు.

 ఓయు శతాబ్ది ఉత్సవాలు

ఓయు శతాబ్ది ఉత్సవాలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో దుర్గా ఆలయం ఆడిటోరియం సిడ్నీలో జరిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకుతెలంగాణ మంత్రి నాయని నరసింహ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపి జోడీ మెకే, , ఎంపి జియోఫ్రే లీ కూడా పాల్గొన్నారు. వివిధ ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పేద సంఖ్యలో పాల్గొన్నారు.

ఓయు ఘనత ఇదీ..

ఓయు ఘనత ఇదీ..

ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ అని, మన ఉస్మానియా యూనివర్శిటీ ఎంతో మంది విద్యార్థులను మేధావులు, మహానేతలుగా తీర్చిదిద్ది న ఘనచరిత్ర కలదని, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ మన ఉస్మానియా యూనివర్శిటీ అని నాయని నర్సింహారెడ్డి అన్నారు. చరిత్రలో నిలిచిన ఒక విద్యా సంస్థకు వందేండ్లు రావడం, శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చునని అన్నారు. జరిగిన.. జరుగుతున్న.. జరగబోయే విశేషాలెన్నింటినో మరోసారి ఇలా గొప్ప వేదిక మీద సమీక్షించుకోవడం, స్మరించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు.

 తెరాస నిక్కచ్చిగా...

తెరాస నిక్కచ్చిగా...

తెరాస పార్టీ తెలంగాణ పోరు బాటలో ఎంతగా నిక్కచ్చిగా నిల్చిందో, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పాలనలోనూ కూడా అంతే నిస్వార్ధంగా ముందుకు సాగుతోందని నాయని నర్సింహా రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పేరే ఒక సంచలనమని అన్నారు. తెలంగాణ సమాజాన్ని ఏకోన్ముఖంగా ముందుకు నడిపిన మంత్రం. అసాధ్యాలను సుసాధ్యం చేసిన అద్భుతమని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా చేసే దిశగా, హైదరాబాద్‌ను విశ్వనగరం చేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు శ్రమినిస్తున్నామని అన్నారు. తెలంగాణ లో విద్యుత్‌ చీకట్లు శాశ్వతంగా తరిమికొట్టిన పార్టీ టీ ఆర్ఎస్ పార్టీ అని, రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధే తమ నినాదమని ఉద్ఘాటించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రకటించారు.

 అది దేశానికే గర్వకారణం.

అది దేశానికే గర్వకారణం.

తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని నాయని నర్సింహా రెడ్డి అన్నారు. నేడు 90 శాతం గ్రాడ్యూయేట్స్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై వరకు దరఖాస్తు చేసుకుంటున్నారని, సివిల్, ఆర్ముడ్ రిజర్వుడ్ తదితర పోలీసులందరికీ ఐపీఎస్‌లతో సమానంగానే శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులు నేర పరిశోధన, నేరాల అదుపునకు నిర్థిష్టమైన ప్రణాళికతో ముం దుకు సాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక మాట పదేపదే చెప్పే వారు, తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పేవారని, దాని కొరకై ప్రతిఒక్కరు తమ వంతు కృషి చేయాలనీ, ఎన్నారైలు కూడా బంగారు తెలంగాణగా చేసే దిశగా తమవంతుగా మద్దతు ఇవ్వాలని అన్నారు.

 ఆయన ఇలా మాట్లాడారు..

ఆయన ఇలా మాట్లాడారు..

ఈ కారిక్రమంలో టీఆర్ఎస్ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేట్ చేసి తెలంగాణ ఉద్యమంలోచురుకుగా పాల్గొన్నట్లు సభకు తెలిపారు. తాను ఈరోజు ఈలా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు పాలుపంచుకోవడం గర్వంగా ఉందని ఆస్ట్రేలియాలో వున్నా తెలుగు ఆడపడుచులు అందరూ మన తెలంగాణలో తయారు చేసిన పోచంపల్లి చీరలు ధరిస్తే తెలంగాణ లో వున్న పోచంపల్లి కార్మికులకు ఎంతో ఉపోయోగపడ్తురని గుర్తుచేశారు. అందుకే తాను ఆస్ట్రేలియన్ ఎంపి జోడీ మాకేయ్ కు తెలంగాణ గుర్తుగ ప్రత్యేక పోచంపల్లి చీరను బహుకరించారు.

 ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి...

ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి...

టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి మహమ్మద్అజమ్ అలీ గారు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకొంటున్నారని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు.ఈ కారిక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు శ్రీ. సంతోష్ గుప్తా, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు కామిటి చైర్మన్ వినోద్ ఎలెటీ, మహేష్ ఘంటసాల, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల ,రామ్ గుమ్మడివాలి, గోవెర్దన్ సుమేషు రెడ్డి , వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, ప్రశాంత్ కడప్రూర్తి, డేవిడ్ రాజు, మిథున్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా అధ్యక్షులు అశోక్ మరం, సందీప్ మునగాల , నల్లా ప్రవీణ్ రెడ్డి, కపిల్ కాట్పెల్లీ, తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Home minister Nayini Narsimha Reddy urged the Australians to inveest in his state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి