వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లిదండ్రుల కలను నిజం చేసిన ఎన్నారై... 89వ అంతస్తు భవంతి కొనుగోలు(ఫోటో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ తాను అమెరికన్‌గా మారడానికే తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చారని సంచలం వ్యాఖ్యలు చేస్తే... చికాగోలో స్ధిరపడిన ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సంజయ్ షా తన తల్లిదండ్రుల భారతీయ అమెరికన్ కలను నిజం చేశాడు.

NRI sets record for Chicago home buy

ఇందుకోసం చికాగోలోని ట్రంప్ టవర్‌లో 17 మిలియన్ డాలర్లు (సుమారు 104 కోట్లు)తో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. 15,000 చదరపు అడుగుల స్థలంలో 89వ అంతస్తు భవనాన్ని కొనుగోలు చేశాడు. సంజయ్ కొనుగోలు చేసిన ఈ ఆకాశహర్మ్యం అతని తల్లి దండ్రుల కోసమేనని తెలిపాడు.

ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ముంబైలోని 1,200 స్వేర్ ఫీట్ల ఓ అపార్టమెంట్ లో నివసిస్తున్నారు. సంజయ్‌కు మాత్రం కొత్తగా కొనుగోలు చేసిన ఆ భారీ భవంతిలో ఉండే ఉద్దేశం లేదట. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి చికాగోని సౌత్ బారింగ్టన్‌లో నివసిస్తున్న సంజయ్ తన పాత భవంతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

English summary
Bobby Jindal's parents might have come to the United States to realize the "American Dream," but Sanjay Shah has no doubt he was chasing the "Indian-American Dream."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X