ఇల్లంతా బంగారమే! సౌదీ యువరాజా.. మజాకా? కానీ ఏం ప్రయోజనం...

Posted By:
Subscribe to Oneindia Telugu

రియాధ్, సౌదీ: ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ బిజినెస్‌మన్ ఆయన. ఫోర్బ్స్ ప్రకటించిన.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన వారిలో 41వ స్థానంలో ఉన్నారాయన. పైగా ఆయన సౌదీ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కూడా. ఆయన పేరు అల్ వాలీద్ బిన్ తలాల్.

సౌదీలో అల్ వాలీద్ బిన్ తలాల్ పేరు తెలియని వారు ఉండరంటే అందులో అతిశయోక్తి లేదు. సౌదీతో వ్యాపార సంబంధాలు ఉన్న ఏ దేశమైనా.. ఇతడితో సన్నిహిత సంబంధాలు నెరపకుండా ఉండదు.

Saudi Arabia Arrests 11 Princes, Including Billionaire Alwaleed bin Talal

అలాంటి అల్ వాలీద్ బిన్ తలాల్ ఇప్పుడు సౌదీ ప్రభుత్వ అనూహ్య చర్యతో కటకటాల పాలయ్యారు. నిధుల దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన 11 మంది రాజ కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, బడా సంపన్నులను కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్బంధించింది.

వీరిలో వాలిద్ కూడా ఉన్నారు. అరెస్టయిన వారందరిలోనూ అత్యంత సంపన్నమయిన వ్యక్తి వాలిద్. సౌదీ రాజ వంశానికి చెందిన వాలిద్‌కు ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. 19.2 బిలియన్ డాలర్ల (దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగానే) ఆస్తిగల ఆయనకు ఆ దేశ రాజధాని రియాద్‌లో పెద్ద ఇంద్రభవనమే ఉంది.

Saudi Arabia Arrests 11 Princes, Including Billionaire Alwaleed bin Talal

ఆ భవనం విలువ దాదాపు 130 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో 888 కోట్ల రూపాయల పైచిలుకు అన్నమాట. అంతటి విలువైన భవంతిలో తన ఇద్దరు భార్యలతో వారి పిల్లలతో ఉంటారు వాలిద్. ఆ రాజ భవంతిలో మొత్తం 317 గదులు ఉంటాయి.

ఆ భవనంలో 250 టీవీలు ఉంటాయి. పైగా అవన్నీ బంగారు పూత పూసినవి. ప్రత్యేకంగా 45 సీట్లు ఉండే సినిమా థియేటర్ కూడా ఆ భవనం లోపలే ఉంటుంది. ఒకేసారి 2500 మందికి వంట వండి వడ్డించేందకు అవసరమైన వంటమనుషులు కూడా ఉంటారు. అలాంటి అద్భుత రాజప్రసాదాన్ని మీరూ చూసి తరించిపోండి!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Saudi Arabia announced the arrest on Saturday night of the prominent billionaire investor Prince Alwaleed bin Talal, plus at least 10 other princes, four ministers and tens of former ministers. The announcement of the arrests was made over Al Arabiya, the Saudi-owned satellite network whose broadcasts are officially approved. Prince Alwaleed’s arrest is sure to send shock waves both through the kingdom and the world’s major financial centers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి