లండన్‌లో "మహిళా దినోత్సవం": కవితకు కృతజ్ఞతలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఏషియన్ వుమెన్ రిసోర్స్ సెంటర్( AWRC) కార్యాలయంకి టాక్ మహిళా కార్యవర్గ సభ్యులంతా వెళ్లి, వారి సంస్థ ప్రవాస మహిళల, పిల్లల పరిరక్షణ కోసం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలని తెలుసుకొని వినూత్నంగా మహిళా దినోత్సవం వారితో కలిసి జరుపుకున్నారు.

AWRC డైరెక్టర్ సర్బజిత్ గాంగేర్ ముందుగా మహిళలు, పిల్లల కోసం వారి సంస్థ చేస్తున్న కార్యక్రమాలని టాక్ సభ్యులకి వివరించారు. ప్రస్తుతం మహిళలు ఎన్నో విషయాల్లో సరైన తోడు లేక వారి పట్ల జరుగుతన్న హింసని, అన్యాయాన్ని, అవమానాల్ని చెప్పుకొనే వేదిక లేక జీవితం పట్ల ఆశల్ని కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆసియా ఖండం నుండి ఉన్న ప్రవాస మహిళలకు ఇటువంటి చేయూత ఎంతో అవసరముందని తెలిపారు.

Women's day celebrated in London

తమ సంస్థ గురించి తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా, మహిళల పట్ల మరింత గౌరవం పెంచే మహిళా దినోత్సవ వేడుకలు తమ సభ్యులతో జరుపుకోవాలనే ఆలోచన తమకెంతో స్ఫూర్తినిచ్చిందని, అలాగే తమకు ఆర్థిక సహాయాన్ని అందించినందుకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కందికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ - సాటి మహిళగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న AWRCని ప్రోత్సహించడం తన బాధ్యత అని, ఎన్నో ఆశలతో విదేశాలకు వస్తున్న మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనమంతా కలిసి ఎదుర్కొని వారికి భరోసా కలిపించడమే కాకుండా వీలైనంత సహాయం అందించాలని తెలిపారు. టాక్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండి సహాయ చేస్తుందని AWRC డైరెక్టర్‌కి చెక్ ఇచ్చి ఆర్ధిక సహాయాన్ని అందించారు.

Women's day celebrated in London

మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలోపేతం అయినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

టాక్ మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ- టాక్ సంస్థ సేవే లక్ష్యంగా పని చేస్తుందని, ఇలా మహిళల సంక్షేమం కోసం పని చేస్త్తున్న సంస్థ సభ్యులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం తమలో కొత్త ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఇలా తాము క్రియాశీలకంగా పని చేసేలా మమ్మల్నే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆదర్శంగా ఉన్న ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

చివరిగా సంస్థల సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి పరస్పరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమం లో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు, కల్చరల్ కో ఆర్డినేటర్ జాహ్నవి వేముల, కల్చరల్ సెక్రటరీ శ్రావ్య వందనపు, సభ్యలు మమతా జక్కి, AWRC సభ్యులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
London NRIs organised Women's day in london and advocated for Women empowerment.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి