• search
  • Live TV
keyboard_backspace

Puneeth Rajkumar: ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లేవారికి వార్నింగ్ బెల్: కనీస జాగ్రత్తలు తప్పవంటూ

Google Oneindia TeluguNews

బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. శరీర ధారుఢ్యం కోసం అహర్నిశలు జిమ్‌లో శ్రమించే వారికి ఓ ముందస్తు హెచ్చరికలాగా మారింది. ఆయన కన్నుమూసిన ఉదంతం పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఇదివరకు బాలీవుడ్ సెలెబ్రిటీ సిద్ధార్థ్ శుక్లా కూడా ఇదే తరహాలో సడన్ డెత్‌కు గురయ్యారు. ఎక్సర్‌సైజ్ పేరుతో శరీరాన్ని విపరీతంగా అలసటకు గురి చేయడం మరణానికి దారి తీయొచ్చనే వార్నింగ్ బెల్స్‌ను పంపించాయి.. ఈ రెండు హఠన్మరణాలు కూడా.

ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటూ..

పునీత్ రాజ్‌కుమార్.. ఆయన పేరును తలచుకోగానే నిండుగా నవ్వుతూ కనిపించే ముఖం మన కళ్లముందు మెదలాడుతుంది. దానితోపాటు ఆయన నటించిన సినిమాలు, వాటిల్లో ఆయన చేసే సాహసాలు, ఫైట్స్, పాటల్లో మెరుపుల్లాంటి స్టెప్స్ గుర్తుకొస్తాయి. 46 సంవత్సరాల వయస్సులో ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటూ అకస్మాత్తుగా కన్నుమూయడం అనేది ఎవ్వరూ ఊహించలేనిది. జీర్ణించుకోలేనిది. ఆయన ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

Puneeth Rajkumar: Is this Kannada actor death alarming for sweating in gym so dangerous?

దురలవాట్లకు దూరం..

సాధారణంగా సినిమా నటులు, స్టార్ హీరోలు.. ఫిజిక్‌ను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. దురలవాట్లకు దూరంగా ఉంటారు. స్మోకింగ్‌కు దూరంగా ఉంటారు. ఇదివరకు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుకు స్మోకింగ్ అలవాటు ఉన్నప్పటికీ.. దాని మానుకున్నారాయన. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పుకొన్నారు కూడా. మద్యం తాగే అలవాటు ఉన్నవారు.. పరిమితంగా దాన్ని తీసుకుంటారు. మద్యం ఎక్కువగా తాగితే- బాడీ షేపింగ్ మారిపోతుందనే భయంలో సాధారణంగా సెలెబ్రిటీల్లో కనిపిస్తుంటుంది.

పునీత్‌కు దురలవాట్లు లేవు..

పునీత్ రాజ్‌కుమార్‌కు ఎలాంటి దురలవాట్లు లేవనేది కుటుంబ సభ్యులు గానీ, సన్నిహితులు గానీ చెబుతున్నారు. ఆయన ఫ్యామిలీ డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. పునీత్ పెద్దన్నయ్య శివరాజ్‌ కుమార్‌, రెండు అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ ఇదివరకు ఓ సారి గుండెపోటుకు గురయ్యారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్‌కు వచ్చిన గుండెపోటు మ్యాసివ్. దాని తీవ్రతకు ఆయనకు ఒక చెయ్యి పనిచేయదు. అలాంటి తీవ్రమైన గుండెపోటుకు పునీత్ కన్నుమూశారు.

జిమ్ ఎఫెక్ట్ ఎంత?

సెలెబ్రిటీలు మాత్రమే కాదు.. చాలామందికి జిమ్ అనేది ఒక అలవాటుగా మారింది. రోజువారి దినచర్యల్లో ఓ భాగంగా మారింది. జిమ్‌కు వెళ్లి కండలు పెంచుకోవాలనే ఆశ యువతలో ఉంది. జిమ్ చేయడం అంటే శరీరాన్ని తీవ్ర అలసటకు గురిచేయడమే అనేది నిపుణులు చెబుతుంటారు. సరైన సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని, ట్రైనర్‌లు ఇచ్చే సూచనలు కూడా 100 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉండాలని అంటున్నారు. జిమ్‌లో అనేక రకాలుగా చేసే ఫిట‌్‌నెస్ వర్కవుట్స్ అనేవి, శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.

పల్స్.. బీపీ రేటు ఎలా ఉంటాయి..

జిమ్‌ చేస్తోన్నప్పుడు పల్స్, రక్తపోటు సాధారణంగానే ఉంటాయని, ఒత్తిడి పడిన ప్రతీసారీ హార్ట్ బీట్ హెచ్చుతగ్గులకు గురవుతుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుండె రిథమ్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనేది వారి సూచన. దాని మానన దాన్ని వదిలేసి, ఇష్టం వచ్చినట్లు ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒక రిథమ్ ప్రకారం.. జిమ్ చేయాల్సి ఉంటుందని, ఏ మాత్రం కళ్లు తిరిగినట్టు అనిపించినా, చెమట పట్టినట్టు అనిపించినా.. వాటిని అక్కడికక్కడే ఆపేయాలని, వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అంటున్నారు.

రెండు గంటలు చాలు..

జిమ్‌లో వర్కవుట్లు చేయడానికి రెండు గంటలు చాలని నిపుణులు చెబుతున్నారు. అది కూడా తెల్లవారు జామున 5 నుంచి 7 గంటల్లోపు మాత్రమే అత్యుత్తమ సమయం అని, అది పరిమితంగా, ఒక పద్ధతి ప్రకారం ఉండాలని సూచిస్తున్నారు. దానికి మించి వర్కవుట్లు చేయడం సరికాదని, శరీరానికి కావాల్సిన విశ్రాంతి దక్కి తీరాల్సిందేనని స్పష్టం చేస్తోన్నారు. హై ఇన్టెన్సిటీ ఉన్న వర్కవుట్లు శరీరానికి మంచివి కావని, వాటిని రోజూ చేయడం అడ్వైజబుల్ కాదని అంటున్నారు నిపుణులు. తప్పనిసరిగా చేయాల్సి వస్తే.. కొన్ని ముందు జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.

English summary
There has been a rise in the number of young people suffering heart attacks. Heart attacks are caused by blockages in coronary arteries, which prevent blood and therefore oxygen from reaching the muscles.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X