• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2014 తెలంగాణ కథ తన్లాట: బతికుండి కొట్లాడుదాం

By Pratap
|

గుడ్ల్ల నీళ్లు సుడు తిరుగుతున్నయి. ఎగబీల్చి ఎగబీల్షి ముక్కు ఎర్రగయింది. ఏడుపాగినా ఎక్కిళ్లాగుతాలేవు. అయినా ఎద నుంచి తన్నుకొస్తున్న దు:ఖాన్ని పంటికింద అదిమిపెట్టి బయటికి మాత్రం బాగున్నవా బిడ్డా అని తెంగాణ తల్లి ప్కరిస్తున్నది. మనసు సోకం పెట్టి పల్లె తెంగాణ దిమ్మదీర ఏడుస్తున్నది. ఎవరికి వాళ్లు సెల్ఫ్‌ డెత్‌ సర్టిఫికెట్లను జేబు పెట్టుకొని తిరుగుతున్నరు. పతారం ఊళ్లె సావుడప్పు మోగుతనే ఉంది. ఎ్లని సంసారానికి చేషిన అప్పుకు ఉన్న గుంటెడు పొం ఊడ్సుకపోయింది. గుండ్లె రాయిపడ్డట్టు యాక్సిడెంట్లు, దవఖాన ఖర్సు. బీడీ ఘాటు, ఫ్లోరైడ్‌, వలసలు.

బట్టకు, పొట్టకు తిప్పలై ఊళ్లెకు ఊళ్లు పట్నానికి, సిటీకి క్యూ కడుతున్నయి. పల్లెల్లో ఒక దిక్కు తాగెతందుకు గుక్కెడు నీళ్లు దొరుకుట కనాకష్టమైతుంటె వాడకొక్క వైన్‌షాప్‌ మాత్రం ఎలిగి పోతుంది. జీవితాలు మలిగి పోతున్నయి. ముంబాయి, భీవండి, సూరత్‌తో పాటు దుబాయికీ పోయినోళ్లు పోయినోతిగె వొస్తరని గ్యారంటి లేదు. అయినా దేశం బత్కపోవుడు తప్పుడులేదు. ఊళ్లె పుల్కాషిపురుగోలె తిరిగినోడు సిటీ వాచ్‌మెన్‌గ తేలుతుండు. ఎద్దు, ఎవుసం ఎన్కటి ముచ్చటయింది. కులకషిపిని నమ్మినోడు తీన్‌తెర్లయిండు. బక్కప్యాదోడు బతుకుడే గగనమయింది. బుక్కెడు బువ్వకు, షెంబెడు నీళ్లకు అంగళారుస్తుండ్రు. ఈనే మనుషులు యవ్వనం నుంచి డైరెక్ట్‌గా వృద్ధాప్యంలోకి జారుకుంటుండ్రు. 40 యేండ్లు రాక ముందే ముసల్లోలుగా ముద్ర ఏసుకుంటున్నరు. 30 ఏండ్లు దాటినా ఉద్యోగం లేక యూనివర్సిటీల్లో విద్యార్థులు తల్లడమల్లడమయితుండ్రు. ప్రత్యేక తెంగాణ ఉద్యమం నడిషినన్ని రోజులు తలా ఓ దిక్కు గుంజిండ్రు. ఒగరు ప్రజాస్వామిక తెంగాణ అంటే, ఇంకొకరు సామాజిక తెంగాణ అనీ, మరొకరు భౌగోళిక తెంగాణ అనీ కొట్లాడిండ్రు. ఇప్పుడవన్నీ పోయి ‘బంగారు తెలంగాణ' ఒక్కటే మిగిలింది. మరి ఈ బంగారు తెలంగాణలోనైనా బలవంతపు సావులకు స్వస్తి పుకాలె. బతుక్కు భరోసా కల్పించాలె! కడుపు నిండ తిండి, కంటినిండ నిర్రంది నిద్ర దక్కాలె. ఆత్మగౌరవ కేతనమెగురెయ్యాలె! ఇదే విషయాన్ని ఈ సంకనంలోని కథలు తమదైన రీతిలో చెప్పినై. తెలంగాణ తన్లాటను అద్దం పట్టినయి.

ఛిద్రమవుతున్న గ్రామీణ జీవితాను ఈ కథలు చిత్రికగట్టాయి. మనుషుల్ని కేవం కమర్షియల్‌ గా ఆలోచించే యంత్రాలుగా మారుస్తున్న దోపిడీ సమాజాన్ని రూపుకట్టాయి. గ్రామీణ సమాజం మొత్తం చావు ముంగిట్ల తమ నెంబర్‌ కోసం ఎదురు చూస్తున్న తీరుని ఈ కథలు చిత్రించాయి. ఇందులోని సగానికి పైగా కథల ఇతివృత్తం ‘సావు'కి సంబంధించిందంటే ఆశ్చర్యం కలుగుతది. ఆశ్చర్యం కంటే ఎక్కువ బాధ కలుగుతోంది. రైతులు, చేనేత కార్మికులు, స్వర్ణకాయి ఆత్మహత్య చేసుకుంటుంటే గుండె కుక్కు మంటుంది. పెట్టుబడిదారీ సమాజంలో ఎప్పుడూ పైసున్నోని మాటే ఫైనల్‌. చ్లొబాటయ్యేది కూడా వాడి నోటే! ఈ పెట్టుబడిదారీ సమాజం అభివృద్ధి పేరిట చేస్తున్న కంటికి కనబడని కుట్రల్ని ఈ కథలు ఛేదిస్తాయి.

‘అభివృద్ధి' పేరిట జరుగుతున్న దోపిడీ, హింస, వివక్ష, థాట్‌ పోలిసింగ్‌ అన్నీ కలగలిసి తెలంగాణ సమాజం ముఖ్యంగా గ్రామీణ సమాజం మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. అంగట్లవ్వా అంటే ఎవరికి పుట్టినవ్‌ బిడ్డా అన్నట్టున్న తెలంగాణ బతుకుల్ని, ఆగమై ఆఖరికి కాటికి చేరుతున్న కథల్ని, ఏడ్షి ఏడ్షి ఇంకిపోయిన కన్నీళ్లకు కారణాల్ని ఈ కథు వెతికాయి. అందుకే కథకు ప్రయత్న పూర్వకంగా తమ కండ్ల ముందట కనుమరుగైతున్న జీవితాకు అక్షరాతో ఆయువు పోసిండ్రు. శాశ్వతం చేసిండ్రు.

ఎవ్వరైనా తాగుబోతుల్నే తప్పుపడుతరు. త్లెల్దనుక కుల్లబెట్టే బార్ల గురించి, బీర్ల గురించి కుయ్యిమనరు. కుసుక్కుమనరు. ఇప్పుడున్నది సాక ప్రభుత్వం బారాభజే దాకా బార్లను తెరుస్తదట. బార్లకేలి రాంగానే బండిమీదున్నోన్ని బయట పట్టుకొని ఫైన్ వసూల్జేస్తున్నరు. అంటే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎట్ల తాగిపించుడు, జేబుకెల్లి గుంజుకునుడు గురించే ఆలోచిస్తుంది తప్ప ఆ మహమ్మారిని ప్రయత్న పూర్వకంగా తుడిషి పెట్టేందుకు కృషి జేస్తలేదు. తెలంగాణ అంతటా కరువు పరిస్థితులున్నా ఏ జిల్లా కూడా ఎక్సయిజ్‌ ఆదాయం తగ్గలేదు. వైన్‌షాపు, బెల్ట్‌షాపు, బార్షాప్‌కు అడ్డేమి లేదు. అందుకే పసునూరి రవీందర్‌ ‘సంపుడు పంజెం' కథలో తాగుడుకు అడిక్ట్‌ అయిన విషయాల్ని రికార్డు చేసిండు. సస్తే షేదిడిపిచ్చుడు ఎనుకటి ముచ్చట. ఇయ్యా రోజు ఊళ్లె ఎవరో ఒకరు సస్తనే ఉన్నరు. ఇగ షేదు ఇడిపిచ్చుడంటే మళ్లా రోజూ తాగుడే! సచ్చుడే!! ఇంకో విషయం ఈ తాగుడు వల్ల నష్టపోయేది నూటికి 90శాతం బహుజనులే!

Telangana 2014 short story collection

బెంగళూరు జాతీయ హైవే మీద హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో షాద్‌నగర్‌ బైపాస్‌ దగ్గర తండాలో ఒకే ఒక్క మగాయిన మిగిలిండు. మిగిలిన అందరూ రోడ్డు దాటుతూ యాక్కిడెంట్ల్ల సచ్చిపోయిండ్రు. హైకోర్టు వరకు కేసు పోయి ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఇదంతా అభివృద్ధి తెంగాణ బిడ్డకు ఇచ్చిన నజరానా. అందుకే గాదె వెంకటేశ్‌ ‘టోల్‌గేట్‌' కథలో హైవేపై వెళ్లాల్సిన వెహికిల్స్‌ ఊళ్లకేళి ‘కిల్‌' చేస్తూ పోవడంతో మోగిన సావు డప్పుని రికార్డు చేసిండు. మనిషి పాణానికి విలువ లేకుండా పోయింది. ఇయ్యా ఇంట్ల రేపు మంట్లె అనేది సామెత. కాని ఇయ్యాకు తావు లేకుండా రేపే రాజ్యమేుతుంది. సావు సడీ సప్పుడు లేకుండా మనిషిని తప్పదీస్తుంది.

పైస మీది మమకారం తోటి పెద్ద పెద్ద దవఖానలు, పేరు మోషిన డాక్టర్లు పేద ఆడోళ్ల బతుకుతోటి ఆడుకునే తీరుని కె.వి.నరేందర్‌ ‘డబ్బుసంచి' కథలో చెప్పిండు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం బతుక్కి భరోసా అని పేదలు భావిస్తే డాక్టర్లు మాత్రం ఆడోళ్లు కడుపునొప్పితోటి హాస్పిటల్‌కు పోతే సాలు గర్భసంచిని తీషేషి ఆరోగ్యశ్రీ స్కీం కింద ప్రభుత్వం నుంచి పైసు వసూల్జేసుకుంటున్నరు. దీనిపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేదు. జీవం పోయాల్సిన డాక్టర్లే మాయిముంతను మాయం జేస్తున్నరు.

చావు ఎంత చౌక అయిందో, దానికి నిర్దిష్టమైన కారణమంటూ ఏదీ ఉండదని హృదయాన్ని కదిలించే విధంగా ఆర్తితో చెప్పిండ్రు పూడూరి రాజిరెడ్డి, మోహన్‌ రుషి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఆత్మహత్య గురించి దు:ఖాగ్నిలో సీనియర్‌ కథకు రామా చంద్రమౌళి రికార్డు చేసిండు. మావోయిస్టు ఉద్యమంలో బిడ్డను కోల్పోయిన తల్లి వేదనను ‘అమ్మ' కథలో తాయమ్మ కరుణ చెప్పిండ్రు. పర్కపెల్లి యాదగిరి తన ‘అలికిన చేతులు' కథలో మాయమైన తల్లి గురించి తల్లడిల్లుకుంటూ రాసిండు. హృదయమున్న ప్రతి మనిషి కండ్ల్ల నీళ్లు తెప్పించే కథలివి. ఇవన్నీ తెలంగాణలో మరణమృదంగం ఎట్లా మోగుతూ ఉందో చెప్పిండ్రు. సమాజంలోని ఘర్షణ, వేదన, హింస, దౌర్జన్యం, నిష్పూచితనం ఎంతటి అమానవీయతకు దారి తీస్తాయో ఈ కథలు చెబుతాయి. మెరుగైన సమాజం కోసం మనిషిపడే తన్లాటను సోయితో ఈ కథలు రికార్డు చేశాయి. ఈ కథల్లో ఈ మట్టిమీది ప్రేమ చెట్ల మీది ప్రేమ, సాటి మనుషుల మీద ప్రేమ కండ్లకు కడుతాయి. ప్రకృతి మీద ఇంతటి ప్రేమ తెలంగాణ మట్టిమనిషికి తప్ప మరెవ్వరికీ ఉండదంటే ఆతిశయోక్తి కాదేమో!

ఆధునిక సమాజంలో అనుకరణ ప్రధానమై, అవిష్కరణ అవశేషమైంది. అందుకే స్వీయ సంఘర్షణను పెద్దింటి అశోక్‌కుమార్‌ ‘చుక్కలు రాని ఆకాశం' కథలో రికార్డు చేసిండు. ఇంగ్లీషు మీడియం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటూనే దాన్ని తెలంగాణలో అము చేయడం వల్ల ఏర్పడుతున్న ఒక అసమాన సమాజాన్ని తెలియజెప్పిండు. స్వయంగా టీచర్‌ కూడా అయిన పెద్దింటి ఈ కథలో గ్రామాల్లో ఆంగ్ల విద్య మీద ఉన్న మోజుని చరిత్రకెక్కించిండు. శిల్ప రీత్యా కాసు ప్రతాపరెడ్డి కథ అద్భుతంగా ఉంది. స్ప్లిట్‌ పర్సనాలిటీని, సంఘర్షణని ఈ ‘పూర్తికాని కథ' రికార్డు చేసింది.

ఈ కథలు తమ మాయిముంత నుంచి తమ మూలాల నుంచి తమ తండ్లాట నుంచి మాట్లాడుతున్నయి. వీటిలో పై పై ఆరాటాలు, ఆర్భాటాలు లేవు. జీవం ఉంది. ఈ మట్టి స్వభావమైన పోరాటం ఉంది. అమ్మతనం ఉంది. తల్లి తండ్లాట ఉంది. మన ఊరు, మన భాష, మన జీవం కోల్పోతున్న తన్లాట ఉంది. రమా సరస్వతి కథ తెంగాణ కథకు భరోసా కలిగించే విధంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న విషయాల్ని తెలంగాణ దృక్కోణంలో రికార్డు చేయడం ఇప్పటి అవసరం. అలాగే తెలుగులో సైన్స్‌ ఫిక్షన్‌ కథలు మొదట రాసింది ఒద్దిరాజు సోదరులు. అయితే ఆ పరంపరను కొనసాగించే విధంగా వి. శ్రీనివాస్‌ 2047 కథను మల్చిండు. ముగింపు కథకు మరింత బలాన్ని చేకూర్చింది. మోహన్‌ రుషి కథ కూడా శైలీ, శిల్పం రెండూ సమపాళ్లలో ఉండి తెంగాణ మిడిల్‌క్లాస్‌ బతుకుల్ని చిత్రిక గట్టింది. వీరి నుంచి భవిష్యత్‌లో మరిన్ని మంచి కథు ఆశించవచ్చు. భండారి అంకయ్య లాంటి వాండ్లు ఏడు పదులు దాటిన తర్వాత కథా రచన ప్రారంభించినప్పటికీ యువకులతో పోటీ పడుతూ రాసిండు. ప్రత్యేక తెంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. ఇందులోని కథకులందరూ ఆ ఉద్యమంలో భాగస్వాములైన వారే! ఉద్యమకాయిగా ఉన్నవారు ఇయ్యాలు సాహిత్యకారులుగా సమాజానికి సేవ జేస్తున్నరు.

ఇదిగో తెలంగాణ ఇయ్యాల ఇక్కడ మల్ల మొదలవుతున్నది. లేషి నిబడుతున్నది. మునుం బడుతున్నది. టెక్కు, టెక్నిక్కు ప్రదర్శించే నాటకాలు, ఆర్భాటాలు తెలియని ఒక స్వచ్ఛత, సజీవత, మనిషి పట్ల ఆర్తి, జీవితం పట్ల మమకారం ఈ కథల్లో ఉంది. ఈ కథలు తమ సమాజం గురించి తమ నేల గురించి తమ అస్తిత్వం గురించి తన్లాడుతున్నయి. పక్కన తెలుగు ప్రాంతం వారి ఉన్నత తరగతి సమస్యకు భిన్నంగా ఇక్కడి కథలున్నాయి. ఈ కథు తమ నే , తమ గోస, తమ భాష, టోటల్‌గా తెలంగాణ మనిషితనాన్ని పట్టిస్తున్నాయి. కడుపు నిండిన వారి సమస్యు ఇందులో కనిపించవు.

కథలు ఫైనల్‌ చేసినంక ఆలోచిస్తే ఈ సంకనంలోని సగానికి పైగా కథలు చావు గురించి ఉండడం మమ్మల్ని అతలాకుతం జేసింది. అంటే ఇక్కడి జీవితాు ఎంత గోసను ఎల్లదీస్తున్నయో, ఎన్ని కష్టాలను ఎదుర్కుంటున్నయో ఈ కథలు డాక్యుమెంట్‌ చేస్తున్నాయి. పరిష్కారం కోసం గొంతెత్తమంటున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. మునుం పట్టి ముందుకు సాగమంటున్నయి.

- సంపాదకు తరపున సంగిశెట్టి శ్రీనివాస్‌

English summary
Singidi Telangana writers published a short collection of 2014 year from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X