టీ20 వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేసిన బంగ్లాదేశ్.. !!
టీ20 వరల్డ్ కప్ ను కోసం భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుండి బహిష్కరించిన తర్వాత ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధృవీకరించింది. వరల్డ్ కప్ మ్యాచులు ఆడటానికి భారత్ వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుండి ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడుదల చేయడం దీనికి ప్రధాన కారణం.
భద్రతా కారణాలను చూపుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాము ఆడబోయే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా అభ్యర్థించింది. ఈ మేరకు ఐసీసీకి ఈ- మెయిల్ పంపించింది. భద్రతపరమైన ఆందోళనల కారణంగా టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారత్ కు పంపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత గడ్డపై తమ మ్యాచ్‌లను ఆడకూడదని 17 మంది బీసీబీ డైరెక్టర్లు తీర్మానించారని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

మొన్నటి ఐపీఎల్ ఆక్షన్ లో ముస్తాఫిజుర్‌ను ఏకంగా 9.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది కోల్ కత నైట్ రైడర్స్. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలు, అక్కడి హిందువుల భద్రతపై భారత్ లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్ కావడం వల్ల అతన్ని ఐపీఎల్ లో ఆడించకూడదని సూచనలు బీసీసీఐకి అందాయి. దీంతో కేకేఆర్ యాజమాన్యం అతన్ని తొలగించాల్సి వచ్చింది.
దీనికి ప్రతిస్పందించింది బీసీబీ. ఏకంగా భారత్ లో ఆడబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను బాయ్ కాట్ చేసింది. బంగ్లాదేశ్ తన ప్రపంచ కప్ ప్రస్థానాన్ని ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్ తో ప్రారంభం కావాల్సి ఉంది. ఇటలీ, నేపాల్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో పాటు గ్రూప్ సీలో ఉందీ జట్టు. ఆయా దేశాలతో భారత్ లో ఒక్కో మ్యాచ్ ను ఆడాల్సి ఉంది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా శ్రీలంకకు తరలించాలని కోరుతోంది.
ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం ఉన్నప్పటికీ తమ దేశ క్రికెటర్ భారత్‌లో ఆడలేకపోతే దానికి అర్థం లేదని బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు నజ్రూల్ వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లో తమ దేశ జట్టుకు భద్రత ఉంటుందనుకోవట్లేదని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని కోరుతూ బీసీబీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారంపై నిషేధం విధించాలని సమాచార, ప్రసారాల శాఖను కోరారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications