స్టార్ బ్యాటర్లు అవుట్: టీమిండియాలో భారీ మార్పులు
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది భారత్. తొలి మ్యాచ్ లో ఓడింది. సిరీస్ డిసైడర్ అయిన గువాహటి టెస్ట్ లో గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. సెనురాన్ ముత్తుస్వామి, కైలె వెర్రెయిన్ క్రీజ్ లో ఉన్నారు. ఇంకాస్సేపట్లో రెండో రోజు ఆట ఆరంభమౌతుంది. దీని తర్వాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మొదలవుతుంది.
ఈ నెల 30వ తేదీన తొలి వన్డే ఇంటర్నేషనల్. రాంచీ స్టేడియం దీనికి వేదిక. డిసెంబర్ 3, 6 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. రాయ్ పూర్, విశాఖపట్నం ఈ రెండింటికీ ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. ఈ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ నేడు జట్టు ఎంపిక చేయనుంది. ముంబైలో ఈ భేటీ ఏర్పాటైంది. జట్టు ఎంపిక, కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. స్టార్ బ్యాటర్లు దూరం కావడమే దీనికి ప్రధాన కారణం.

మెడ నొప్పి కారణంగా శుభ్‌మన్ గిల్ తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉండట్లేదు. గిల్ స్థానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో కేప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ అప్పగించే అవకాశం ఉంది. కేప్టెన్సీ పగ్గాలను అందుకోవడానికి వీరిద్దరే ప్రధాన పోటీదారులు. మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ పేరును బీసీసీఐ పరిగణనలోకి తీసుకోవట్లేదు.
రిషభ్ పంత్ టీ20 ఇంటర్నేషనల్స్ లల్లో ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో ఆడిన అనుభవం అతనికి తక్కువ. 2024 ఆగస్టులో శ్రీలంకతో చివరి వన్డే ఆడాడు పంత్. ప్రస్తుతం గిల్ అందుబాటులో లేని కారణంగా గువాహటి టెస్ట్ కు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. వన్డేలు ఆడిన అనుభవం తక్కువగా ఉందనే కారణంతో అతన్ని గిల్ కు ప్రత్యామ్నాయంగా మాత్రమే జట్టులోకి తీసుకోవచ్చు. కేప్టెన్సీ భారాన్ని కేఎల్ రాహుల్ మీదే పెట్టే అవకాశాలు ఉన్నాయి. వన్డేలకు పంత్ వద్దనుకుంటే తిలక్ వర్మ వైపు బీసీసీఐ మొగ్గు చూపొచ్చు.
తాత్కాలిక కేప్టెన్‌గా కేఎల్ రాహుల్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 12 వన్డేలు, ఓ టీ20కి కేప్టెన్‌గా వ్యవహరించాడు. తొమ్మిదింట్లో జట్టును విజయం వైపు నడిపించాడు. కేప్టెన్‌గా వన్డేల్లో 33.55 యావరేజ్ తో 302 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 58 నాటౌట్. రిషభ్ పంత్ కంటే చాలా బెటర్ ఫిగర్స్ ఇవి. అందుకే రాహుల్ కే కేప్టెన్సీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.
-
రూ.48కే హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్.. -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications