వేలి గాయం దెబ్బకు ఆ స్టార్ ఆల్ రౌండర్ IPL కేరీర్ ఓవర్..?
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ గడువు దగ్గర పడుతోంది. డిసెంబర్ 16వ తేదీన అబుధాబి వేదికగా ఈ వేలం జరుగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే వెలువడింది కూడా. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంఛైజీలు కూడా తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఈ రిటెన్షన్ జాబితా వెలువడిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ పరిణామాల మధ్య ఐపీఎల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ వచ్చే సీజన్ లో ఆడట్లేదు. ఐపీఎల్ 2026 నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. అతను తీసుకున్న ఈ నిర్ణయం.. క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన అబుధాబి వేదికగా జరగబోయే మినీ వేలం పాటలో కూడా తన పేరును రిజిస్టర్ చేయించుకోలేదు మ్యాడ్ మ్యాక్సీ. మినీ వేలం ఆటగాళ్ల జాబితాలో మాక్స్వెల్ పేరు లేదు.

మొత్తం 77 ప్లేయర్ల కోసం ఈ మినీ ఆక్షన్ నిర్వహించాల్సి ఉంది. ఇందులో విదేశీ ఆటగాళ్ల కోటా 31. ఆయా ఫ్రాంచైజీలు అదనపు పేర్లను ఈ నెల 3వ తేదీలోగా, తుది జాబితాను 5వ తేదీ లోగా వేలం నిర్వాహకులకు అందజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ ముందుగానే తప్పుకొన్నాడు.
2025 ఐపీఎల్లో మాక్స్వెల్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొమ్మిది మ్యాచ్‌లలో 78 పరుగులు, 4 వికెట్లు మాత్రమే తీశాడు. వేలి గాయం కారణంగా సీజన్ మధ్యలోనే నిష్క్రమించాడు. పేలవ ప్రదర్శన వల్ల పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. 2012 సీజన్ తో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన మాక్స్వెల్. పవర్ హిట్టింగ్తో బ్యాటింగ్ తీరుతెన్నులను మార్చేశాడు. కొంతకాలంగా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు.
ఐపీఎల్ 2025 వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని విడుదల చేయగా పంజాబ్ కింగ్స్ 4.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీ కూడా అతన్ని రిటైన్ చేసుకోలేదు. మాక్స్వెల్ కెరీర్లో 2014 అత్యుత్తమ ఐపీఎల్ సీజన్. 542 పరుగులు సాధించాడా సీజన్ లో. ఆ తర్వాత 2017లో 310, 2021లో 513, 2022లో 301, 2023లో 400 పరుగులు చేశారు. నిలకడలేమి అతన్ని వేధిస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications