ఎంగేజ్మెంట్, ప్రెగ్నెన్సీ: హార్దిక్ పాండ్యా ప్రియురాలు క్లారిటీ!
నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మోడల్, నటి, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అయిన మహీకా శర్మతో ప్రేమలో ఉన్నారు. ఈ జంట తరచూ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు, పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతుండగా.. అంతకంటే ముందే వీరికి ఎంగేజ్మెంట్ జరిగిందని, అంతే కాకుండా మహీకా శర్మ ప్రెగ్నెంట్ అని ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై మహీకా శర్మ స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్పందించి తన పోస్టుల ద్వారా అసలు నిజాన్ని పరోక్షంగా వెల్లడించింది. మహీకా శర్మ తన ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. ఒక గులాబీ రంగు హార్ట్ సింబల్‌ను జత చేసి ఒక పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇలా పేర్కొంది. "ఇంటర్నెట్లో నా నిశ్చితార్థం జరిగిపోయిందని నేను చూస్తున్నాను. కానీ నేను ఒక విషయం చెప్పాలి... నేను ప్రతిరోజూ మంచి నగలు ధరిస్తాను." అని తెలిపింది. ఈ సమాధానం ద్వారా ఆమె తన చేతికి ఉన్న నగలు నిశ్చితార్థపు ఉంగరాలు కావని.. అవి సాధారణంగా తాను ధరించే నగలేనని పరోక్షంగా స్పష్టం చేసింది.

ప్రెగ్నెన్సీ వార్తలపై ఛలోక్తి
నిశ్చితార్థం వార్తలతో పాటు వస్తున్న గర్భం (ప్రెగ్నెన్సీ) వార్తలపై కూడా మహీకా శర్మ వ్యంగ్యంగా స్పందించింది. ఆమె ఒక చిన్న అమ్మాయిని గులాబీ రంగు పిల్లల కారులో కూర్చున్నట్లు చూపించే ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు క్యాప్షన్‌గా "నేను గర్భం వార్తలతో పోరాడటానికి ఈ కారులో రావాలా?" అని రాసింది. మహీకా శర్మ చేసిన ఈ పోస్టులు నెటిజన్లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కొందరు అభిమానులు ఆమెను ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఆమె ఈ పోస్టుల ద్వారా నిజమైన నిశ్చితార్థం వార్తలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
నటాషా-మహీకాల పోలిక
హార్దిక్ పాండ్యా 2020లో నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే ఆమె గర్భవతి కావడంతో ఈ వివాహం రహస్యంగా జరిగింది. ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ జీవితంలో మహీకా రావడంతో, అభిమానులు ఈ ఇద్దరినీ పోలుస్తున్నారు. కొందరు అభిమానులు నటాషాను 'వజ్రం'గా అభివర్ణిస్తూ, మహీకాను 'బంగారం'గా పోల్చుతున్నారు. హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఎదురుచూస్తున్నారు.
Hardik Pandya–Mahieka Sharma engagement buzz intensifies after the actress showed off a sparkling diamond ring, sparking fresh speculation online. Stay tuned as the rumours gain momentum. pic.twitter.com/06EBjKqypw
— OneVision Media (@onevision_media) November 20, 2025
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications