టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్
టీ20 ప్రపంచ కప్ 2026లో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ చూసిన ప్రేక్షకులు అందరు ఫైనల్ కన్నా సెమీఫైనల్ రసవత్తరంగా సాగిందని చెప్తున్నారు. దానికి కారణం ఇంగ్లండ్ బ్యాట్సమెన్ జాకబ్ బెథెల్.సెమిస్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 253పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.ఈ స్కోర్ చూసి మ్యాచ్ వన్ సైడెడ్ అని ఇండియన్ క్రికెట్ ఫాన్స్ అనుకున్నారు.
ఇక,సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే ఇంగ్లాండ్ టీమ్ 64 పరుగులకు 3 వికెట్లు కోల్పోయారు.అదే సమయంలో క్రీజులోకి వచ్చాడు బెథెల్.ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా తర్వాత బౌండరీలతో రెచ్చిపోయాడు.48 బంతుల్లో 105పరుగులతో (8ఫోర్లు, 7 సిక్సలు) విజయావకాశాలు వదిలేసుకున్నా ఇంగ్లాండ్ టీమ్ కు ఈ ఇన్నింగ్స్ చూసాక కొంత ఆశ కలిగింది. చివరికి ఇంగ్లాండ్ ఓడినా జాకబ్ బెథెల్ ఆటతీరును చూసి క్రికెట్ ఫ్యాన్స్ అంత మెచ్చుకున్నారు.

ఇక, ది హండ్రెడ్ రాబోయే సీజన్‌కు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ తమ కొత్త కెప్టెన్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్‌ను నియమించినట్లు ప్రకటించింది.గత ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో గాయపడిన హ్యారీ బ్రూక్ స్థానంలో ఇంగ్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ఆయన జట్టును నడిపించారు. ఇప్పుడు ఈ నాయకత్వ అనుభవాన్ని ఫీనిక్స్‌లో కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
ఆసక్తికరంగా, మార్చి 11 వేలానికి ముందే ఫీనిక్స్ జట్టు బెథెల్‌ను £340,000 మన ఇండియన్ కరెన్సీలో రూ. 4కోట్ల 20లక్షలు ధరకు కొనుగోలు చేసింది.ఫీనిక్స్ నుండి లండన్ స్పిరిట్‌కు మారిన లియామ్ లివింగ్‌స్టన్ స్థానంలో బెథెల్ ఆడతాడని ఫ్రాంచైజీ పేర్కొంది.ఐర్లాండ్ సిరీస్ నుండి బెథెల్ ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.ఈ శీతాకాలంలో న్యూజిలాండ్,శ్రీలంకలలో జరిగిన వైట్-బాల్ సిరీస్‌లు,టీ20 ప్రపంచ కప్‌లోనూ అతను డిప్యూటీ కెప్టెన్‌గా వ్యవహరించారు.

తన నియామకంపై బెథెల్ మాట్లాడుతూ, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కెప్టెన్‌గా సెలెక్ట్ చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.ఈ జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.గత సంవత్సరం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం వల్ల ఈ బాధ్యతను స్వీకరించడానికి నేను మరింత సిద్ధంగా ఉన్నాను.ఆ అనుభవం నా నాయకత్వాన్ని మెరుగుపరచడంలో,అలాగే ఒక టీమ్ నుండి మంచి ఫలితాలను ఎలా సాధించాలో నేర్పింది. అని ESPNcricinfoతో తెలిపారు.
బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ హెడ్ కోచ్ షేన్ బాండ్ జాకబ్ బెథెల్ నియామకంపై స్పందించారు.ఈ యువ ఆటగాడి ఇటీవలి ప్రదర్శనలను, నాయకత్వ అనుభవాన్ని ప్రశంసించారు. జాకబ్ ఒక అత్యుత్తమ యువ నాయకుడు. తన వయస్సుకంటే ఎక్కువ పరిపక్వతను అతను ఇప్పటికే చూపించాడు.గత సంవత్సరం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా చేసిన అనుభవం అతని వ్యూహాత్మక ఆలోచన, స్థిరత్వం, అలాగే తన సహచరులను ప్రేరేపించే సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించింది అని బాండ్ అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications