Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీమిండియాకు అపశకునం- దెబ్బ మీద దెబ్బ: స్టార్ ప్లేయర్ కు వైరల్ ఫీవర్.. !!

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మహాసంగ్రామం నేడు ప్రారంభం కాబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్త దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోన్నాయి. మొత్తం 20 జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆడనున్నాయి., ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం పోటీ పడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ దఫా కూడా టైటిల్‌ హాట్ ఫేవరెట్. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో భారత్ ఎదుర్కొన్న వివాదాలు.. ఆఫ్ ఫీల్డ్ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఉత్కంఠభరితంగా మారింది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. అతను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. దీంతో వాంఖడేలో జరిగే ఈ పోరుకు అతనికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించింది. తొందరపడి అతన్ని ఆడించాలని అనుకోవట్లేదు. ఓ చిన్న జట్టుతో మ్యాచ్ కావడం, తాత్కాలిక ఉపశమన చర్యలతో బుమ్రాను ఆడించితే మొదటికే మోసం వస్తుందని భావిస్తోంది.

Jasprit Bumrah Likely to Miss India Opening T20 World Cup vs USA as Mohammed Siraj to replace him

బుమ్రా దూరం కావడంతో భారత్‌కు ప్రస్తుతం 13 మంది ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంకా జట్టులో చేరలేదు. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. తుది ఫిట్‌నెస్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. మ్యాచ్‌కు ముందు బుమ్రా నెట్ ప్రాక్టీస్ కు కూడా రాలేదు. దీంతో అతను గైర్హాజర్ కావడం ఖాయమైంది. బుమ్రా స్థానంలో తుది జట్టులో మహ్మద్ సిరాజ్‌కు చోటు లభించవచ్చు.

నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయంతో హర్షిత్ రాణా టోర్నమెంట్ నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో అతని స్థానంలో జట్టులో చేరాడు సిరాజ్. బ్యాటింగ్‌ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడి ఇన్నింగ్ ను ఆరంభించనుంది.

ఈ టోర్నమెంట్ మొత్తం మీద వీరిద్దరే ఓపెనింగ్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో ఇషాన్ ఓపెనర్‌గా 53 పరుగులు చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్‌పై తిరువనంతపురంలో సెంచరీ బాదాడు. సంజు శాంసన్ ఫామ్ కోల్పోవడంతో, టీమిండియా కిషన్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది.

నేటి మ్యాచ్ లో ఆడే తుదిజట్టులో- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కేప్టెన్), శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి ఆడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+