టీ20 వరల్డ్ కప్ లో ప్రధాని మోదీని ఆకట్టుకున్న ఈ చిన్న జట్టు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడారు. పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఇందులో టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. క్రీడలు- మానవత్వాన్ని వికసింపజేస్తాయని, ప్రపంచ పౌరులందరినీ ఏకం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ టోర్నమెంట్ పై భారతీయ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. జెర్సీ ఏదైనప్పటికీ- భారతయ తత్వం ప్రస్ఫూటించిందని కితాబిచ్చారు.
విదేశీ క్రికెట్ జట్లలో ఆడుతున్న భారత సంతతి క్రీడాకారుల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూస్తున్నప్పుడు అనేక మంది భారతీయ క్రికెటర్లు కనిపించారని గుర్తు చేశారు. మ్యాచ్ సందర్భంగా ఓ ప్లేయర్ ధరించిన జెర్సీ ఏ ఇతర దేశానికి సంబంధించినప్పటికీ పేరు మాత్రం మన దేశానికి చెందినవాడనే విషయం ఇట్టే తెలిసిపోతుందని అన్నారు. ఓ సగటు భారతీయుడికి ఇది ఎంగానో సంతోషాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు.

ఆ ఆటగాడు భారతీయ మూలాలను కలిగి ఉండటం, అతని కుటుంబం ప్రపంచం నలుమూలలా స్థిరపడిందనడానికి ఈ టోర్నమెంట్ ఓ నిదర్శనమని మోదీ అన్నారు. తాను స్థిరపడిన దేశం తరఫున ఆ ప్లేయర్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఆనంద పడతామని చెప్పారు. భారత సంతతి క్రీడాకారులు తమ 'కర్మభూమి' అభివృద్ధికి తోడ్పడుతూనే తాము స్థిరపడిన ఆ దేశ జెర్సీని ధరించి పూర్తి అంకితభావంతో మైదానంలోకి అడుగుపెడతారని ఆయన ప్రశంసించారు.
కెనడా క్రికెట్ జట్టులో అత్యధికంగా భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారని మోదీ అన్నారు. ఆ జట్టు కెప్టెన్ దిల్‌ప్రీత్ బాజ్వా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జన్మించగా, నవనీత్ ధలివాల్ చండీగఢ్‌కు చెందినవారు. హర్ష్ థాకర్, శ్రేయాస్ మొవ్వా వంటి అనేక మంది ఆటగాళ్లు కెనడా, భారత్.. రెండింటికీ గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అమెరికా క్రికెట్ జట్టులోనూ భారతీయ మూలాలు ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు.
అమెరికా జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్ అండర్-16, అండర్-18 జట్లకు ఆడాడని, ముంబైకి చెందిన సౌరభ్, హర్మీత్ సింగ్, ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ లాంటి వారు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఓమన్ క్రికెట్ జట్టులో జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జై, ఆశిష్ వంటి భారతీయ మూలాలున్న ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారుని, న్యూజిలాండ్, యూఏఈ, ఇటలీ జట్లలో ఉన్న ప్లేయర్లు క్రికెట్ పై తమదైన ముద్ర వేసుకుంటున్నారని మోదీ కితాబిచ్చారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications