వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ దూరం!
IND vs WI: టీమిండియా యువ క్రికెటర్, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్(63) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం(ఫిబ్రవరి 27, 2026) తెల్లవారుజామున 4.36 గంటలకు ఆయన తుదిశ్వాస విడిశారు. ఈ విషాద వార్త తెలియగానే క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ను ఈ స్థాయికి తీసుకురావడంలో ఆయన తండ్రి పడ్డ శ్రమను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఖాన్చంద్ సింగ్ గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయనను గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చేర్పించారు. రింకూ సింగ్ గత మ్యాచ్ ముగిసిన తర్వాత తండ్రిని చూడటానికి వచ్చి వెళ్లారు. అయితే శుక్రవారం ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వార్త అందిన వెంటనే టీమిండియా క్యాంప్‌లో ఉన్న రింకూ సింగ్.. ఉదయం 5 గంటలకే చెన్నై నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకుని తండ్రి కడసారి చూపు కోసం వెళ్లారు.

కీలక మ్యాచ్‌కు స్టార్ ఫినిషర్ దూరం
రింకూ సింగ్ తండ్రి మరణంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో బోర్డు రింకూకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా రింకూ సింగ్ మార్చి 1న వెస్టిండీస్‌తో జరగబోయే సూపర్-8 మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఆయన స్పష్టం చేశారు. రింకూ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో గడపాలని నిర్ణయించుకోవడంతో ఆయన టీమ్ సభ్యులతో కలిసి కోల్‌కతాకు ప్రయాణం చేయడం లేదు.
టీమిండియాకు ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ప్రయాణం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం. ఇది ఒక రకంగా 'వర్చువల్ క్వార్టర్ ఫైనల్'. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉండి చివరలో మెరుపులు మెరిపించే రింకూ సింగ్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటుగానే భావిస్తున్నారు. ఆయన స్థానంలో తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సంతాపం తెలుపుతున్న క్రికెట్ లోకం
రింకూ సింగ్ తండ్రి మరణం పట్ల మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఒక సామాన్య సిలిండర్ డెలివరీ మ్యాన్‌గా ఉంటూ.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని రింకూను అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దిన ఆయన కృషిని అందరూ కొనియాడుతున్నారు. తన ఎదుగుదలకు కారణమైన తండ్రిని కోల్పోవడం రింకూకు తీరని లోటని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications