హిట్ మ్యాన్ రీఎంట్రీ అద్దిరిందబ్బా- అదే ఉతుకుడు..!!
ప్రతిష్ఠాత్మక విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో సిక్కింతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై విజయం వైపు దూసుకెళ్తోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా.. దీన్ని అలవోకగా అందుకుంటోంది ముంబై. 23 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ఓడిపోవడం అసాధ్యం.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ తడాఖా చూపుతున్నాడు. తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తోన్నాడు. ఈ క్రమంలో మెరుపు సెంచరీ సాధించాడు. 62 బంతుల్లోనే 100 పరుగులను రాబట్టుకున్నాడీ హిట్ మ్యాన్. ఇందులో ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లు, 10 బుల్లెట్ల వంటి ఫోర్లు ఉన్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం డొమెస్టిక్ లో అద్దిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. డొమెస్టిక్ క్రికెట్ లో అతనికి ఇది 37వ సెంచరీ. 109 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

2023లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన వన్డే ఇంటర్నేషనల్ లో 63 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత అదే స్థాయిలో చెలరేగాడు. సిక్కిం క్రికెటర్లపై అదే ప్రతాపం చూపించాడు. 2027 ఐసీసీ వరల్డ్ కప్ వరకూ వన్డేల్లో కొనసాగితీరాలంటే డొమెస్టిక్ మ్యాచ్ లు ఆడక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ శర్మ సాధించిన ఈ మెరుపు సెంచరీ.. అతని ప్రస్థానాన్ని ఖరారు చేసినట్టయింది.
కాగా- తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం కే సాయి సాత్విక్- 34, అమిత్ రజేరా- 0, ఆశీష్ థాపా- 79, క్రాంతివీర్ కుమార్- 34, గురిందర్ సింగ్- 17, రాబిన్ లింబో- 31 (నాటౌట్), పాల్జొర్ తమాంగ్- 10, అంకుర్ మలిక్- 9, లీ యాంగ్ లెప్చా- 1 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లల్లో తుషార్ దేశ్ పాండే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications