రెండేళ్ల నిషేధం సరిపోదు: ఐపీఎల్ మోసగాళ్లపై గవాస్కర్ ఫైర్!
ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతున్న వేళ విదేశీ ప్లేయర్ల వైఖరిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. బెన్ డకెట్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనే కారణంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ ఆకస్మిక నిర్ణయంపై సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు.
సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే?
"బీసీసీఐ విదేశీ ప్లేయర్ల కోసం అమలు చేస్తున్న రెండేళ్ల నిషేధం పద్ధతి సరిగ్గా పని చేయడం లేదు. ఆటగాళ్లపై నిజమైన ప్రభావం చూపేలా మరింత కఠినమైన శిక్షలు ఉండాలి. బెన్ డకెట్ వేలంలో మంచి ధర పలికాడు, తీరా సీజన్ మొదలయ్యే ముందు ఇలా తప్పుకోవడం జట్టు ప్రణాళికలను దెబ్బతీస్తుంది. కేవలం రెండేళ్లు ఆడకుండా ఆపేస్తే సరిపోదు, వారి ఐపీఎల్ కెరీర్‌పై శాశ్వత ప్రభావం చూపేలా నిబంధనలు మార్చాలి" అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

బెన్ డకెట్ నిర్ణయం వెనుక అసలు కారణం?
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-4 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ సిరీస్‌లో బెన్ డకెట్ కేవలం 20.2 సగటుతో నిరాశపరిచాడు. "ఐపీఎల్ ద్వారా వచ్చే భారీ మొత్తాన్ని వదులుకుని, నాటింగ్ హామ్ షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇంగ్లాండ్ తరపున ఆడటం నాకు ఎంత ముఖ్యమో నిరూపించుకోవడానికి ఇది సరైన మార్గం" అని బెన్ డకెట్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. యాషెస్ సిరీస్ మధ్యలో జరిగిన ఓ పార్టీలో డకెట్ మద్యం మత్తులో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యి విమర్శలకు దారితీశాయి. తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్
కేఎల్ రాహుల్‌తో కలిసి బెన్ డకెట్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆశించింది. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో ఓపెనింగ్ స్లాట్ కోసం మరో ఆటగాడిని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది కూడా పలువురు విదేశీ ప్లేయర్లు వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తప్పుకోవడంతో బీసీసీఐ రెండేళ్ల నిషేధం నియమాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దీనికంటే కఠినమైన శిక్షలు రావాలని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేస్తున్నారు.
-
IPl 2026: బంగ్లాదేశ్ యూటర్న్-ప్రభుత్వం కీలక నిర్ణయం..! -
IPL ఫ్యాన్స్ కు బిగ్ షాక్ - మ్యాచులకు దూరంగా ధోనీ, CSK అధికారిక ప్రకటన..!! -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
IPL 2026: ఆర్సీబీ శుభారంభం.. సన్‌రైజర్స్‌కు ఘోర పరాజయం -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications