వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సి. రామచంద్రయ్యకు దేవుళ్లే దిక్కు?

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడి విఫలమైన కడప జిల్లా కాంగ్రెసు నాయకులు మరో రకంగా సంతోషపడుతున్నారట. ఆ సంతోషానికి కారణం ఆయనకు దేవాదాయ శాఖను కేటాయించడమే. దేవాదాయ శాఖను నిర్వహించినవారికి ఎవరికి కూడా రాజకీయంగా కలిసి రాలేదనేది ఓ నమ్మకం. ఆ శాఖను తీసుకోవడానికి మంత్రులు ఎవరూ గతం కొన్నేళ్లుగా ఇష్టపడడం లేదు. దేవాదాయ శాఖను నిర్వహించినవారు ఎవరు కూడా రాజకీయంగా ఆ తర్వాత ముందుకు సాగలేకపోయారు. జూపల్లి కృష్ణా రావు మంత్రి పదవికి రాజీనామా చేయడానికి అదో కారణమని చెబుతారు. దేవాదాయ శాఖను ఇష్టపడక ఆయన కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని అంటారు.

మర్రి చెన్నారెడ్డి హయాంలో 1989లో దేవాదాయ శాఖను నిర్వహించిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దండు శివరామరాజుకు దేవాదాయ శాఖను కేటాయించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో దండు శివరామరాజు ఓడిపోయారు. క్యాన్సర్ వ్యాధితో ఆయన ఇటీవల మరణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాదాయ శాఖను నిర్వహించిన ఎం. సత్యనారాయణ రావు 2009 ఎన్నికల్లో ఓడిపోయి, రాజకీయంగా ముందు వరుసలో లేకుండా పోయారు.

ఆ తర్వాత జువ్వాడి రత్నాకర్ రావు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా చురుగ్గా లేకుండాపోయారు. ఆ తర్వాత దేవాదాయ శాఖను నిర్వహించిన గాదె వెంకటరెడ్డి 2009లో గెలిచినప్పటికీ ఆయనకు ఆ తర్వాత మంత్రి పదవి దక్కలేదు. జూపల్లి కృష్ణారావు విషయం తెలిసిందే. జూపల్లి రాజీనామా తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు దేవాదాయ శాఖను అప్పగించే ప్రయత్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. కానీ దాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. మొత్తం మీద, సి. రామచంద్రయ్య రాజకీయ జీవితంపై కూడా దేవాదాయ శాఖ ప్రభావం పడుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

English summary
Can C Ramachandraiah, the newly-appointed endowments minister beat the jinx associated with the portfolio, is the question uppermost on the minds of many in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X