వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిషికేశ్వరి సూసైడ్: రాత్రుల్లో రూం నుంచి వెళ్లగొట్టారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటన పైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ.. ప్రిన్సిపల్ బాబురావు వ్యవహార శైలిని తప్పుపట్టింది.

అయితే, ఇప్పటి వరకు ఆయన పైన ఇంకా చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బాబురావు పైన విచారణ జరపాలని ప్రభుత్వానికి సూచించింది. బాబురావు వల్లే విశ్వవిద్యాలయంలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్ వంటి అనేక సంఘటనలకు అతనే కారణమని తేల్చింది.

బాబురావు విషయమై కమిటీ పలు విషయాలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో చెప్పింది. విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటనకు ప్రిన్సిపల్ కారణమని, ర్యాగింగ్‌కు అనుకూలంగా విద్యార్థులను ప్రోత్సహించారని కమిటీ నివేదికలో పేర్కొంది.

 Truths behind Rishikeshwari suicide!

బాబురావు తమతో చనువుగా ఉండటం వల్లే సీనియర్ విద్యార్థులు జూనియర్ల పైన చెలరేగిపోయారని, దుస్తులు లేకుండా తమ ముందు డ్యాన్స్ చేయాలని జూనియర్లను వేధించేవారని కూడా కమిటీ తేల్చింది. జూనియర్ల ఫోన్ నెంబర్లు సీనియర్ అమ్మాయిలు సీనియర్ విద్యార్థులకు ఇచ్చేవారు.

వారితో మాట్లాడాలని వేధించేవారు. రిషికేశ్వరితో పాటు ఆమె సహచర జూనియర్ విద్యార్థినులను సీనియర్ విద్యార్థినులు గదులు ఖాళీ చేయాలని బయటకు గెంటేసి రాత్రి వేళ్ల్లో ఆరుబయట నిల్చోబెట్టేవారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ మద్యం తాగి విద్యార్థులతో కలిసి చిందేశాడు.

రిషికేశ్వరి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయకుండా.. ప్రిన్సిపల్‌గా బాబురావు దానిని విస్మరించాడని.య ర్యాగింగ్ నిరోధక చట్టం పరిధిలో కేసును విచారించాలని తేల్చింది. వాటితో పాటు క్రిమినల్ లా, మహిళా వేధింపుల చట్టాల కింద కూడా విచారణ చేపట్టాలని సూచించింది.

English summary
Truths behind Rishikeshwari suicide!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X