అణుదాడి చేయమంటే చేయం!: ట్రంప్‌కు అమెరికా న్యూక్లియర్ జనరల్ దిమ్మతిరిగే షాక్
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ స్ట్రాటెజిక్ కమాండ్ అధికారి శనివారం దిమ్మతిరిగే షాకిచ్చారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ స్ట్రాటెజిక్ కమాండ్ అధికారి శనివారం దిమ్మతిరిగే షాకిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కావొచ్చు, ఆయన తర్వాత వచ్చే వారు కావొచ్చు చట్టవిరుద్ధంగా అణు దాడి చేయమంటే చేసేది లేదని తేల్చి చెప్పారు.

ట్రంప్ అణు దాడికి ఆదేశాలు జారీ చేస్తే
అమెరికా న్యూక్లియర్ టాప్ కమాండర్, ఎయిర్ ఫోర్స్ జనరల్ జాన్ హైటెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అణు దాడి చేయమని చట్ట విరుద్ధంగా ఆదేశాలు జారీ చేస్తే, వాటిని తాము స్వీకరించేది లేదని చెప్పారు. అణుదాటి ప్రయోగం చేయబోమన్నారు.

ఓ ప్రశ్నకు సమాధానంగా
అమెరికా వ్యూహాత్మక కమాండర్‌గా పని చేస్తున్న జాన్ హైటెన్ ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా చెప్పారు.

కమాండర్స్ తెలివితక్కువ వాళ్లు కాదు
కమాండర్స్ తెలివి తక్కువ వాళ్లు కాదని జాన్ హైటెన్ అన్నారు. మంచి, చెడును ఆలోచించగలిగే శక్తి ఉందని, ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ట్రంప్ చట్ట విరుద్ధమైన అణ్వాయుధ దాడికి ఆదేశాలి ఇచ్చినా పాటించం అన్నారు.

అణు దాడి చేసే పద్ధతిపై
అణు దాడి చేసే విధానాన్ని, పద్ధతిని కూడా జాన్ హైటెన్ వివరించారు. జాన్ హైటెన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రక్షణ శాఖ స్పందించాల్సి ఉంది. వాస్తవానికి నిర్ణయాలు అధ్యక్షుడి చేతిలో ఉంటాయి. కానీ జాన్ అందుకు విరుద్ధంగా మాట్లాడారు.
-
Bab-el-Mandeb: ఎర్ర సముద్రంలో మరో హార్ముజ్- అదీ మూసేస్తే చమురుకు చుక్కలే..! -
యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు! -
అల్లం టీ Vs లెమన్ టీ..ఎవరికి ఏది మేలు చేస్తుంది..!! -
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
ఖమేనీ ప్రాణాలతో లేడనే మాట వింటున్నా- ఇరాన్ సరెండర్ కావడం బెటర్: ట్రంప్ -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
గుడ్డులో పచ్చ సొన ఎవరికి మంచిది, ఎవరికి డేంజర్..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications