Anthropic: భారత్ లో అడుగుపెట్టకముందే ఆంత్రోపిక్ కు భారీ షాక్..!
భారత్ లోనూ అదే పేరున్న సంస్ధ ఉండటంతో అమెరికన్ ఏఐ సంస్ధ ఆంత్రోపిక్ కు ఇక్కడ న్యాయపరమైన సమస్యలు తప్పడం లేదు.
అత్యాధునిక ఏఐ టూల్స్ ను తీసుకొచ్చి ఐటీ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అవసరం లేకుండా ప్లగిన్స్, టూల్స్ రిలీజ్ చేస్తూ అంతర్జాతీయంగా మార్కెట్లను ముంచేసిన అమెరికన్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) కు భారత్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న ఆంత్రోపిక్ కు ఐటీ రాజధాని బెంగళూరులో ఈ షాక్ తగిలింది. దీంతో భారత్ లో ఎంట్రీ విషయంలో ఆంత్రోపిక్ పునరాలోచించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో తమ ఏఐ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆంత్రోపిక్ ప్లాన్ చేసుకుంది. అయితే కర్నాటకలో ఇదే ఆంత్రోపిక్ పేరుతో మరో ఐటీ సంస్థ ఇప్పటికే నడుస్తోంది. అయితే దాని పూర్తిపేరు ఆంత్రోపిక్ సాఫ్ట్ వేర్. దీంతో స్థానికంగా తమ సంస్థ ఉండగా.. ఆంత్రోపిక్ అనే విదేశీ సంస్థకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఈ కర్నాటక సంస్థ అక్కడి కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది.

టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం, భారతీయ సంస్థ ఆంత్రోపిక్ సాఫ్ట్వేర్... తాము 2017 నుంచి ఈ పేరును ఉపయోగిస్తున్నామని ఇప్పుడు అమెరికా సంస్ధ రాక తమ వినియోగదారులలో గందరగోళం సృష్టించిందని ఆరోపిస్తోంది. ఇదే ఆరోపణలతో కర్నాటకలోని కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది. ఆంత్రోపిక్ పేరు వినియోగానికి గుర్తింపు, గందరగోళ నివారణ, అలాగే కోటిరూపాయల నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఆంత్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అయ్యాజ్ ముల్లా ఈ పిటిషన్ వేశారు. అయితే తాము ఆంత్రోపిక్ తో ఘర్షణ కోరుకోవడంలేదని, కేవలం పాత పేరు వినియోగం పట్ల స్పష్టత, గుర్తింపు మాత్రమే కోరుతున్నామని తెలిపారు. చర్చలు విఫలం కావడంతోనే కోర్టును ఆశ్రయించామన్నారు.

జనవరి 20న కర్ణాటక కోర్టు ఆంత్రోపిక్‌కు నోటీసులు జారీ చేసింది, అయితే మధ్యంతర చర్యలకు మాత్రం నిరాకరించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న చేయనుంది. దీనిపై ఆంత్రోపిక్ స్పందించలేదని టెక్‌క్రంచ్ తెలిపింది. మరోవైపు ఆంత్రోపిక్ భారతీయ మార్కెట్‌పై తన ఫోకస్ పెంచుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఆఫీసును ఓపెన్ చేయడంతో పాటు మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఎండీ ఐరినా ఘోస్‌ను అధిపతిగా నియమించుకుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ వంటి గ్లోబల్ ఏఐ కంపెనీలకు కీలక పోటీ ప్రాంతంగా మారుతోంది.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!












Click it and Unblock the Notifications