ఐసీయూలో స్టార్ డైరెక్టర్..!
భారతీయ సినీ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో "భారతీ రాజా" ఒకరు. గ్రామీణ జీవనాన్ని అత్యంత సహజంగా, వాస్తవికంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ గా ఆయన పేరొందారు. 1941 జూలై 17న తమిళనాడులో జన్మించిన భారతీ రాజా అసలు పేరు చిన్నసామి. థియేటర్ నేపథ్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు.
ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేదని అంటుంటారు. కాగా 1977లో విడుదలైన "16 వైయతినిలే" సినిమాతో భారతీ రాజా దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా తమిళ సినిమాకు కొత్త యుగాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్, రజనీకాంత్లకు ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.

అయితే గత మార్చిలో భారతీరాజా ఏకైక కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణం ఆయనను తీవ్ర దుఃఖానికి గురిచేసింది. ఆ బాధ నుండి కోలుకోవడానికి మలేషియాలోని కుమార్తె ఇంట్లో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఆపై చెన్నైకి తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా 80 ఏళ్లు దాటిన భారతీరాజా అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడమ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
భారతీ రాజా గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనవసరమైన వదంతులను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని.. త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అభిమానులు సైతం ఆయన ఆరోగ్యం గురించి నెట్టింట పోస్ట్స్ పెడుతూ చర్చ జరుపుతున్నారు.
మరోవైపు దర్శకుడిగా మాత్రమే కాకుండా, కొత్త నటులను పరిచయం చేయడంలోనూ భారతీ రాజా కీలక పాత్ర పోషించారు. కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్, భాగ్యరాజ్, రాధిక, రేవతి వంటి పలువురు నటులు ఆయన సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. "కిజక్కే పోగుమ్ రైలు", "సిగప్పు రోషక్కల్", "కాదల్ ఓవియం", "అలైగళ్ ఓయ్వదిల్లై", "ముధల్ మరియాదై", "వేదం పుదిథు", "తాజ్ మహల్" వంటి సినిమాలు ఆయనకు మంచి హిట్స్ ఇచ్చాయి.
కాగా కాలక్రమేణా భారతీ రాజా నటుడిగా కూడా తన ప్రతిభను చూపించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలు, సీనియర్ క్యారెక్టర్లలో ఆయన నటన ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. వయసు పెరిగినా ఆయన నటనలోని సహజత్వం మాత్రం తగ్గలేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో భారతీ రాజా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. జీవితకాల సాఫల్య పురస్కారాలతో పాటు, తమిళ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన గౌరవాలు ఆయన సేవలకు నిదర్శనంగా నిలిచాయి.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications