డిసెంబర్ రెండో వారంలో టాలీవుడ్‌పై దండయాత్ర.. ఏకంగా 16 సినిమాలు !!
ప్రతి నెలా, ప్రతి వారం థియేటర్లలోకి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి. అయితే 2025 ఏడాదిలోని చివరి నెల అయిన డిసెంబర్ పై ఫిల్మ్ లవర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మొదటి వారం మాత్రం మూవీ లవర్స్‌ను నిరాశపరిచింది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన "అఖండ 2" వాయిదా పడటం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది.
బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా ఫైనాన్షియల్ సెటిల్ మెంట్స్ కారణంగా మూవీ వాయిదా పడింది.
దీంతో అందరూ కానీ రెండో వారంపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ వారంలో ఒకేసారి 16 సినిమాలు థియేటర్లలోకి రానుండట హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి. ముఖ్యంగా వీకెండ్ కలెక్షన్స్ నిర్ణయాత్మకంగా ఉండనున్నాయి. ఇప్పుడు ఆ సినిమాల లిస్ట్ ఏంటి? అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే మూవీస్ ఏవి? వివరంగా చూద్దాం..

డిసెంబర్ 12న విడుదల కాబోతున్న 16 సినిమాలు
మోగ్లీ..
యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో పూర్తి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. రోషన్ నటన, కథలోని నెమ్మదిగా పెరిగే ఎమోషనల్ డ్రమా సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది.
సైక్ సిద్ధార్థ్..
హీరో నందు ప్రధాన పాత్రలో చేసిన 'సైక్ సిద్ధార్థ్' కూడా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొన్నేళ్లుగా నందుకు పెద్ద హిట్లు రాకపోవడంతో, ఈ సినిమా అతనికి ఒక 'కమ్‌బ్యాక్ మూవీ'గా మారే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్లు ఈ సినిమాను యువతలో చర్చనీయాంశంగా మార్చాయి.
ఇట్స్ ఓకే గురు..
చరణ్ సాయి హీరోగా.. ఉషశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "ఇట్స్ ఓకే గురు". సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటించిన ఈ మూవీని మణికంఠ దర్శకత్ వహించారు. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. డిసెంబర్ 12 రిలీజ్ కానుంది.
అన్నగారు వస్తారు ( డబ్బింగ్ )..
తమిళ్ హీరో కార్తీ నటిస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
డ్రైవ్ - (డబ్బింగ్)
లాక్డౌన్ - (డబ్బింగ్)
మిన్స్టీరియోస్
ఈషా
సకుటుంబనాం
నా తెలుగోడు
పైసావాలా
ఫెయిల్యూర్ బాయ్స్
వన్ బై ఫోర్
ఘంటసాల
కామ అండ్ డిజిటల్ సూత్రాస్
డిసెంబర్ 13న విడుదల..
ఎవడి సినిమా కి వాడే హీరో
ఒకే రోజు 16 సినిమాల విడుదల అంటే, స్క్రీన్‌షేరింగ్ నుంచి వర్డ్-ఆఫ్-మౌత్ వరకు తీవ్రమైన పోటీ తప్పదు. మరి ఈ తరుణంలో డిసెంబర్ రెండో వారం నిజంగా మూవీ లవర్స్‌కు ఒక రిచ్ బఫే లాంటిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ












Click it and Unblock the Notifications