'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రయత్నంతో వస్తున్నాడు శర్వానంద్. అదే బైకర్ మూవీ.. ఇండియాలోనే మొదటి మోటోక్రాస్ ఫిల్మ్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సిద్ధం అయింది. ఈ మేరకు తాజాగా రిలీజైన ట్రైలర్ అద్భుతంగా ఉంది.
ఎప్పుడూ రొమాంటిక్, కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉండే టాలీవుడ్ హీరో శర్వానంద్ ఈ సారి రూట్ మార్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ సినిమా చేస్తున్నాడు. ఇండియాలోనే మొదటి మోటో క్రాస్ ఫిల్మ్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మేరకు 'బైకర్' మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. ట్రైలర్ చాలా బాగుంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఓ 'బైకర్' లైఫ్ జర్నీని ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
ఇటీవల నారీనారీ నడుమ మురారీ చిత్రంతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ త్వరలోనే 'బైకర్' రూపంలో మరో హిట్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఒక్కసారీగా అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లోని రేసింగ్ సీక్వెన్స్ లు ఉత్కంఠభరితంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. వేగం, భావోద్వేగాలు, గెలుపు కోసం చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ సాగే అవకాశం ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

బైకర్ మూవీని లూజర్ వెబ్ సీరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. చాలారోజుల తర్వాత రాజశేఖర్ కు మంచి క్యారెక్టర్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీతోపాటు శర్వానంద్.. భోగి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలోనూ శర్వానంద్ ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం.
-
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్












Click it and Unblock the Notifications