'వారణాసి' టీజర్ రిలీజ్.. రాముడిగా, శివుడిగా.. సావగొట్టాడయ్యా..
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీకి వారణాసి అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ మూవీలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. ఆయన నందిపై త్రిశూలం పట్టుకుని వస్తున్న పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రోబ్ ట్రోటర్ గ్రాండ్ ఈవెంట్ లో 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉన్న భారీ LED స్క్రీన్ పై ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్ లో సైన్స్, డివోషన్, చరిత్రాక ఘట్టాలను మిక్స్ చేస్తూ ఉన్న వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 512 సీఈ వారణాసి నుంచి 2027 సీఈ మీదుగా 7,200 బీసీఈ వరకు ఘటనలను కలుపుతూ ఉన్న ఈ వీడియో దృశ్యాలు మూవీపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో మహేశ్ ను ఓ రేంజ్ లో చూపించినట్లు ఈ ఈవెంట్ లో రాజమౌళి తెలిపారు.
Mahesh Babu as RUDHRA in #VARANASI. pic.twitter.com/YMUjnnytWX
— rajamouli ss (@ssrajamouli) November 15, 2025
ఈ మూవీలో రుద్రగా మహేశ్ సందడి చేయనున్నారు. వారణాసి మూవీపై మహేశ్ బాబు సంచలన ట్వీట్ చేశారు. వారణాసి చిత్రంలో రుద్ర పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. టైటిల్ గ్లింప్స్ లో ఆయన నందిపై త్రిశూలం పట్టుకుని వస్తున్న దృశ్యాలు న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉన్నాయి. సాక్షాత్తూ పరమ శివుడే త్రిశూలం పట్టుకుని వస్తున్నట్లుగా ప్రేక్షకులు అనుభూతి చెందుతున్నారు.
ఇక ఈ మూవీలో మహేశ్ బాబు సరసన మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. అలాగే మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కుంభ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 2027 వేసవికి రిలీజ్ అవుతుందని దర్శకుడు రాజమౌళి పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications