చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'.. రిలీజ్ డేట్ వచ్చేసింది..
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12, 2026 భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'.. ఈ మూవీ సంక్రాంతికి విడుదల అని ఫస్ట్ నుంచీ చెప్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.
#ManaShankaraVaraPrasadGaru GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY ❤️🔥❤️🔥❤️🔥
— Gold Box Entertainments (@GoldBoxEnt) December 13, 2025
Come with your family and celebrate THE BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 💥💥💥#MSGonJAN12th 🔥
Megastar @KChiruTweets
Victory @venkymama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/SGe1U8vr53
చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న తొలి మూవీ కావడంతో అంచనాలు భారీగా నెలకున్నాయి. అనిల్ రావిపూడి తనదైన హిలేరియస్ టైమింగ్ ఓవైపు మెగాస్టార్ చిరంజీవి మాస్ ఎలివేషన్స్ మరోవైపు.. కలిసి సంక్రాంతికి ఈ మూవీ థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తుందన్న ఆనందంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్.. కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో అటు వెంకీ ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు.

ఈ మూవీని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్, సాహు గారపాటి ఆధ్వర్యంలోని షైన్ స్క్రీన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా శనివారం చిత్రం విడుదల తేదీని వెల్లడించారు.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !!












Click it and Unblock the Notifications