Karthika deepam 2 November 24th: దీప గర్భవతి: జ్యోత్స్నకు భారీ షాక్!
కార్తీకదీపం 2 సీరియల్లో గత ఎపిసోడ్లో జ్యోత్స్న సృష్టించిన గందరగోళం, దీప స్పృహ కోల్పోవడం వంటి హైలైట్స్ తర్వాత నేటి ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది.హోమం తర్వాత కాశీ-స్వప్నల మధ్య గొడవలను గమనించిన కార్తీక్, జోక్యం చేసుకుని కారణం అడిగాడు. తన భర్త కాశీకి జాబ్ రాలేదన్న నిజాన్ని దాచి అబద్ధం చెప్పాడని స్వప్న బాధపడుతుంది. ఆ మనిషి కోసం తండ్రినే వదిలేసుకున్నానని, ప్రేమకు విలువ ఇవ్వని కాశీ తనకు అవసరం లేదని అంటుంది.
దీనిపై కార్తీక్ స్పందిస్తూ, "ప్రేమించిన మనిషికి నిజం చెబితే దూరం అవుతుందనే భయంతోనే కాశీ అబద్ధం చెప్పాడు. అది కూడా ప్రేమే" అని నచ్చజెప్పి, స్వప్న చేతిని కాశీ చేతిలో పెడతాడు. నీలాంటి అన్నయ్య ప్రతి చెల్లికి ఉండాలని దాస్ కార్తీక్‌ను మెచ్చుకుంటాడు. తన తల్లిదండ్రులను కలపాలని, ఒంటరిగా ఉన్న కాంచన జీవితాన్ని చక్కదిద్దాలని కోరుకుంటున్నానని కార్తీక్ దాస్‌తో అంటాడు.

శ్రీధర్, కాంచన మధ్య అనుబంధం:
మరోవైపు, దీప కోసం తులశమ్మకు దండం పెట్టుకుంటున్న కాంచన దగ్గరకు శ్రీధర్ వచ్చి ఆమె కోడలిపై పెట్టుకున్న నమ్మకాన్ని మెచ్చుకుంటాడు. కోడలు అంటే కొడుకు జీవితమని అంటాడు. అప్పుడు కాంచన, శ్రీధర్‌ను ప్రశ్నిస్తూ "మరి నాలో ఉండాల్సిన నిన్ను నా నుంచి ఎందుకు దూరం చేశావు?" అని నిలదీస్తుంది. దీనికి మౌనమే సమాధానమని శ్రీధర్ చెబుతాడు. కాంచన బొట్టు చెరిగిపోవడంతో, శ్రీధర్ ప్రేమగా బొట్టు పెడతాడు. ఈ దృశ్యం చూసిన కావేరి సంతోషపడుతుంది. దీప మీదకి జ్యోత్స్నను ఊసిగొలిపావని కావేరి పారిజాతంపై మండిపడుతుంది.
దీప గర్భవతి: జ్యోత్స్నకు షాక్!
దీప కళ్లు తెరవడంతో కార్తీక్, కాంచన, సుమిత్ర సంతోషిస్తారు. అయితే, దీపకు వాంతులు కావడంతో దశరథ్ డాక్టర్‌ను పిలిపిస్తాడు. ఈ ఇంటికి ఏదో విపత్తు ఉన్నా, ఆనందం లేకుండా పోయిందని దశరథ గురువుగారితో బాధపడతాడు. దానికి, "మంచి కనిపిస్తుంది, వినిపిస్తుంది. జరగబోయేది కలలో కనిపిస్తుంది" అని గురువుగారు చెప్పడంతో, శివన్నారాయణ, కాంచనలకు వచ్చిన కలను వారు చెబుతారు. ఇంతలో దీపను తీసుకుని సుమిత్ర బయటికి రాగా, "మీ భార్య మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టింది" అని డాక్టర్ కార్తీక్‌తో చెప్పడంతో, దీప గర్భవతి అన్న విషయం బయటపడుతుంది. తండ్రి కావడం అంటే బాధ్యతేనని డాక్టర్ వివరించడంతో అంతా సంతోషంతో మునిగిపోతారు. అయితే, ఈ ఇంటి వారసురాలి స్థానం కోల్పోతానని భయపడుతున్న జ్యోత్స్న, పారులు మాత్రం డాక్టర్ మాటలకు షాక్ అవుతారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications