'వారణాసి' మూవీలో హనుమంతుడిగా మరో స్టార్ హీరో..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి 'వారణాసి' అని తాజాగా టైటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి దాదాపు 4 నిమిషాల గ్లింప్స్ ను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాయి. చివరిలో నందిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు.. త్రిశూలం పట్టుకుని వస్తున్న దృశ్యం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇదే ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. రామాయణం, మహాభారతం అంటే తనకు ఇష్టమని.. మహాభారతం తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా మొదలయ్యే వరకూ తాను రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కిస్తానని అనుకోలేదని రాముడి వేశంలో మహేశ్ బాబు తొలి రోజు సెట్ కు వచ్చినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. అంతేకాక శ్రీరాముడి పాత్రలో మహేశ్ ఉన్న ఫోటోను తన వాల్ పేపర్ కింద పెట్టుకున్నానని తెలిపాడు. మళ్లీ ఎవరైనా చూస్తారేమోనని డిలీట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఈ మూవీలో హనుమంతుడి పాత్రపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మూవీలో హనుమంతుడిగా తమిళ స్టార్ హీరో మాధవన్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే మాధవన్.. ఈ సినిమాలో మహేశ్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడని ఇంత కాలం సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఆయన హనుమంతుడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ మూవీలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తోంది. ఇక మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్.. కుంభ అనే విలన్ పాత్రలో మెరుస్తున్నాడు. ఈ మూవీ 2027 వేసవి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications