సినీ క్రిటిక్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫైర్.. షాకింగ్ పోస్ట్ !!
చిత్ర పరిశ్రమలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లలో తమన్.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో సైతం సత్తా చాటుతున్నారు. తమన్ అందించే బ్యాగ్రౌండ్ స్కోర్‌కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బాలయ్య నటించిన అఖండ, డాకు మహరాజ్ సినిమాలతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఓజీ. బాలయ్య అఖండ 2 చిత్రాలతో స్పీకర్స్ బద్దలు కొట్టారు.
అలానే సినిమాలతో పాటు క్రికెట్ పట్ల కూడా ఎక్కువ మక్కువ చూపే ఈ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమాల గురించే కాకుండా పలు ఆసక్తికర విషయాలపై సైతం తమన్ స్పందింస్తుంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఆయన చేసిన పోస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పై తమన్ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చకు తెర లేపింది.

అసలేం జరిగిందంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "రాజాసాబ్". మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
అయితే లేటస్ట్ గానే ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ 2.0 ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ ఈ వీడియోను రీట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్లో సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ పేరును ప్రస్తావించలేదు. దాంతో కొందరు తమన్ అభిమానులు దీనిపై తరణ్ ఆదర్శ్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై స్వయంగా తమన్ రియాక్ట్ అయ్యారు.
ఈ మేరకు తరణ్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. "Music by Thaman. S... This is my Twitter ID" అని ట్యాగ్ చేస్తూ బదులిచ్చారు. దాంతో తమన్ చేసిన ఈ కామెంట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ తరణ్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
And
— thaman S (@MusicThaman) December 29, 2025
It has Music by - Thaman S !! 💣
This is my twitter id @MusicThaman 📈 https://t.co/YbjWA0iewr
-
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !!












Click it and Unblock the Notifications