ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. 'డ్రాగన్' షూట్ లో ఎన్టీఆర్..!!
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి మిసైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఏకంగా 8 దేశాలలో ఉన్న యూఎస్ బేస్ క్యాంపులపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. మరోవైపు మధ్య ఆసియా పరిస్థితిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని భారత్ కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ టీమ్ కు పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. కొద్దిరోజుల క్రితం వరకు ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ జోర్డాన్ లోనే జరిగింది. జోర్డాన్ షెడ్యూల్‌నే మూవీ టాకీ పార్ట్ పూర్తి అయినట్లు సమాచారం. దాంతోపాటు భారీ బడ్జెట్ సాంగ్ షూట్ కూడా చిత్ర యూనిట్ ఇక్కడే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే డ్రాగన్ చిత్ర యూనిట్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు అందరికీ ఊరటను కలిగిస్తున్నాయి.
అసలు డ్రాగన్ మూవీ షూటింగ్ మార్చి ఫస్ట్ వీక్ వరకు జోర్డాన్ లోనే జరగాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీమ్.. ఫిబ్రవరి 22నే తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని భారత్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఒకవేళ షూటింగ్ మరో 4 రోజులు ఆలస్యమై ఉంటే.. ఎన్టీఆర్ తోపాటు వందలాది మంది చిత్ర యూనిట్ అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని ఫిల్మ్ నగర్ వర్గాట టాక్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందుచూపుతో ఎన్టీఆర్ టీమ్ క్షేమంగా హైదరాబాద్ కు చేరినట్లు తెలుస్తోంది. అటు ప్రస్తుతం ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక డ్రాగన్ మూవీ 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ తన దైన శైలిలో యాక్షన్ డ్రామాతో, ఎన్టీఆర్‌ను తెరపై చూపించనున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాక బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
-
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications