OTT: ఓటీటీలోకి 'రాజాసాబ్'.. ఆ స్పెషల్ సీన్స్ తో రచ్చ రచ్చే..!
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందిన భారీ చిత్రం 'ది రాజాసాబ్'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారి హారర్ కామెడీ ఫ్యాంటసీ చిత్రం చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే రాజాసాబ్ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు ఈ మూవీ సిద్ధమైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ఓటీటీలోకి రానుంది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలు కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే థియేటర్ రన్ దాదాపు పూర్తి కావడంతో ఈ మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధం అయింది.
అయితే రెబల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఏంటంటే..? థియేటర్లలో రిలీజ్ అయిన వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ కొంత భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. సాధారణంగా రన్ టైమ్ దృష్ట్యా ఎడిటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలను తీసేయడం సహజం. రాజాసాబ్ విషయంలోనూ అదే జరిగింది. అయితే.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే వెర్షన్ లో ఆ డిలీటెడ్ సీన్స్ అన్నింటినీ యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా పేర్కొన్నారు.

ఇక దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం.. ఫిబ్రవరి 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది. అయితే రాజాసాబ్ మూవీ హిందీలో మాత్రం అందుబాటులోకి రావడం లేదని సమాచారం. అయితే మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ సుమారు రూ. 80- 100 కోట్ల మధ్య చెల్లించి దక్కించుకుందని సమాచారం.
-
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications