ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్..
ఈ ఏడాది చిన్న సినిమాలదే హవా అని మరోసారి నిరూపించిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'.. గ్రేటెస్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే ఎంతో మంది యువ నటీనటులు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వారి ప్రతిభ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ మూవీతో డైరెక్టర్ సాయిలు.. తన ప్రతిభను చాటుకున్నారు. ఉమ్మడి ఏపీలో వరంగల్- ఖమ్మం మధ్య ఉన్న ఓ ఊరిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయిలు.. తొలి ప్రయత్నంలోనే అద్భుతంగా తెరకెక్కించారు.
'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ నవంబర్ 21 న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ రోజు నుంచే భారీ స్థాయిలో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకుందీ ప్రేమకథ. ఈ మూవీలో లీడ్ రోల్స్ లో అఖిల్ రాజ్- తేజస్వి నటించారు. యువ నటీనటులు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. దాంతో యూత్ కు ఇన్ స్టాంట్ గా మూవీ కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 18 వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ఈటీవీ విన్ పోస్టర్ రిలీజ్ చేసింది.

అయితే ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎక్స్ టెండెడ్ కట్ ను ఓటీటీలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది. దీంతో ఈ రన్ టైమ్ కు మరికొన్ని సన్నివేశాలను జోడించనుంది. ఇక ఈ మూవీలో చైతూ జొన్నలగడ్డ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల నిర్మించారు. వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలాగే నరేశ్ అడుపా ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.
-
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!












Click it and Unblock the Notifications