ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదు!
ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. కేవలం ప్రచారం కోసం, ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీలను బూతులు తిట్టడం ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తుందో రేణు దేశాయ్ తన తాజా చర్యల ద్వారా నిరూపించారు. తనపై అసభ్య పదజాలంతా విమర్శలు చేసిన వారిపై రేణు దేశాయ్ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఆరుగురికి పైగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫేమ్ కోసం ఇంత దారుణమా?
ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన నటి రేణు దేశాయ్.. నిందితులను విచారించినప్పుడు తెలిసిన విషయాలు తనను విస్మయానికి గురిచేశాయని పేర్కొన్నారు. "ఎందుకు ఇలా దూషిస్తున్నారు" అని పోలీసులు ప్రశ్నించగా.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై తప్పుడు కామెంట్స్ రాస్తే ఫేమ్ వస్తుందని.. ఫాలోయింగ్ పెరుగుతుందని భావించి ఇలా చేశామని నిందితులు సమాధానం ఇచ్చారట. కేవలం సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంతటి అనాగరికమో రేణు దేశాయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రోలింగ్‌కు పాల్పడే వారికి రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. "మీరు చేసే బూతు కామెంట్స్ కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కావు. పోలీసు కేసు నమోదైతే మీ కెరీర్, మీ కుటుంబం, సమాజంలో మీ గౌరవం అన్నీ దెబ్బతింటాయి. మీ భావ ప్రకటన స్వేచ్ఛను మర్యాదపూర్వక విమర్శలకే పరిమితం చేయండి, దూషణలకు కాదు" అని ఆమె హితవు పలికారు. అవసరమైతే సదరు వ్యక్తులు పనిచేస్తున్న సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తానని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.
All those who used the vulgar language against #RenuDesai on social media have been arrested. pic.twitter.com/AthJnc1PAx
— Milagro Movies (@MilagroMovies) April 5, 2026
చర్యలు మాత్రం ఆగవు..
ఇకపై అరెస్టయ్యే వ్యక్తుల వివరాలను బహిరంగంగా వెల్లడించకూడదని నిర్ణయించుకున్నప్పటికీ.. చర్యలు మాత్రం ఆగవని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు. అజ్ఞాతంగా ఉండి ఎవరినైనా దూషించవచ్చని భావిస్తే అది పొరపాటని, టెక్నాలజీ సాయంతో పోలీసులు ఎవరినైనా పట్టుకోగలరని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ చర్యల వల్ల వ్యవస్థపై తనకు నమ్మకం పెరిగిందని రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు.
-
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త: సీపీ సజ్జనార్ వార్నింగ్ -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
పెళ్లయ్యాక తొలి బర్త్‌డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్‌డ్రాప్‌లో విధ్వంసం -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్












Click it and Unblock the Notifications