ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
ప్రముఖ సీరియల్ నటి నందిని(26) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళం, కన్నడ భాషల్లో పలు సీరియల్స్ లో నందిని నటించి గుర్తింపు పొందారు. తమిళంలో పాపులర్ అయిన గౌరి సీరియల్ లో ఆమె దుర్గ, కనకగా డబుల్ రోల్ లో నటించి ప్రశంసలు పొందారు. పెళ్లి విషయంలో కుటుంబ ఒత్తిడితో డిప్రెషన్ కు గురైన నందిని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆమె మరణానికి ముందు సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తమిళం, కన్నడ భాషల్లో జీవ హూవాగిదే, సంఘర్ష, గౌరి.. తదితర సీరియల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నందిని(26) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళంలో గౌరి సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ లో దుర్గ, కనక అనే డ్యూయల్ రోల్స్ చేసి బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించారు. ఏపీకు చెందిన నందిని.. పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో సూసైడ్ చేసుకుంది. ఈ విషయాన్ని సూసైడ్ నోట్ లో పేర్కొంది.

అయితే నందిని మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పేరెంట్స్ ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నందిని కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ పూర్తయితే కానీ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు బయటకు రావని అధికారులు వెల్లడించారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications