విజయ్ 'జన నాయగన్' మూవీకి షాక్..!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. హెచ్. వినోద్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'జన నాయగన్'. ఇది విజయ్ కు చివరి సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన 'ఒరు పేరే వరలారు' (ఒక పేరే చరిత్ర) సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. మిలియన్స్ లో వ్యూస్ తో ఇండియాలో టాప్ సాంగ్ గా ట్రెండింగ్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి మూవీ 'జన నాయగన్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జన నాయగన్ మూవీ ఆడియో ఫంక్షన్ ను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించనుంది చిత్ర యూనిట్.
అయితే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు సంబంధించి మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆడియో ఫంక్షన్ పై కొన్ని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ లో ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలు ఉండకూడదని రూల్ పెట్టినట్లు సమాచారం. కేవలం మూవీ గురించే మాట్లాడాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ చివరి మూవీ కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు చూస్తున్న నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం ఇలా షరతులు విధించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మూవీలో మమితా బైజు, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, మోనిషా బ్లెసీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. మరోవైపు దళపతి విజయ్.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో కరూర్ ఘటన తర్వాత కొద్దిరోజులపాటు ప్రచారం ఆపేసిన విజయ్.. ఇటీవల ఈరోడ్ లో మరోసారి బహిరంగ సభను నిర్వహించారు.
-
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
73 శాతం ఓట్లతో విజయ్ ప్రభంజనం.. లేటెస్ట్ సర్వే సంచలనం.. ?? -
విజయ్ కు బిగ్ షాక్.. తొలిరోజే ఎన్నికల ప్రచారం రద్దు..! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
విజయ్ పై కక్షసాధింపు? -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
పెరంబూర్ లో విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాాక్ ? ప్రచారానికి దిగకముందే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications