కాస్ట్ కారణంగా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదన్న "విరూపాక్ష" ఫేమ్..!
బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవికృష్ణ. మొగలిరేకులు సీరియల్ లో దుర్గ పాత్రతో మంచి క్రేజ్ పొందారు. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రీసెంట్ గానే వెండితెరపై సాయి తేజ్ నటించిన "విరూపాక్ష" చిత్రంలో భైరవ పాత్రలో తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశారు. కాగా నటుడిగా మారక ముందు రవికృష్ణ టెలివిజన్ రంగంలో సహాయ దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.
అంతే కాకుండా సీరియల్స్‌కు కొంత విరామం ఇచ్చిన రవికృష్ణ.. బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని అక్కడ కూడా అదరగొట్టారు. ఆ క్రమంలోనే 'విరూపాక్ష' సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం పొందారు. ఈ సినిమా ఆయనకు వెండితెరపై కొత్త పాత్రలు రావడానికి సహాయ పడింది. ఆ పాత్రకు పరిమిత స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ.. తన పాత్రకు పూర్తి న్యాయం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు "దండోరా" సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించి మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ రోజుల్లో రోజుకు కేవలం రూ.50 మాత్రమే సంపాదించేనని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇండస్ట్రీపై ఉన్న ప్రేమ, పట్టుదలతో ముందుకు సాగానన్నారు. నటుడిగా మొదటి అవకాశాలు వచ్చిన తర్వాత ఆయన రోజువారీ ఆదాయం రూ.750కు చేరిందని వెల్లడించారు. అలానే సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు.
ఏమన్నారంటే..
తన పూర్తి పేరు 'తోట రవికృష్ణ' అని తెలిసిన తర్వాత, కేవలం ఇంటిపేరు కారణంగా మూడు, నాలుగు సినిమా అవకాశాలు చేజారిపోయాయని తెలిపారు. ఇది తనను మానసికంగా బాధించిందని, ఇండస్ట్రీలో ఇప్పటికీ వివక్షలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో దర్శకులు నేరుగా అసలు కారణం చెప్పకుండా.. "హీరో కంటే హైట్ ఎక్కువగా ఉన్నావు", "ఈ క్యారెక్టర్‌కి సూట్ అవ్వవు" అంటూ అవకాశాలు ఇవ్వలేదని అన్నారు. ఈ మాటలు తనను ఎంతో నిరుత్సాహపరిచినా, నటనపై నమ్మకంతో ముందుకు సాగినట్లు చెప్పారు.
మరోవైపు నువ్వు సీరియల్ నటుడివి కదా... చిన్న చిన్న పాత్రలే చేయి".. "ఇక్కడ హీరో అవ్వాలని అనుకోకు" అని కొందరు అనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించినప్పటికీ, వాటిని అధిగమించానని చెప్పారు. 'విరూపాక్ష' సినిమా తర్వాత తనపై పరిశ్రమ చూపు పూర్తిగా మారిందని రవికృష్ణ తెలిపారు. అవకాశాలు, అవమానాలు, నిరాకరణలు - ఇవన్నీ తనను మరింత బలంగా మార్చాయని స్పష్టం చేశారు. కష్టపడి పని చేస్తే ఒక రోజు గుర్తింపు తప్పకుండా వస్తుందనే నమ్మకంతోనే తాను ముందుకు సాగుతున్నానని వివరించారు.
-
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications