Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్న స్టార్ హీరో?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి పాట అఖండ విజయాన్ని సాధించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని రామ్ చరణ్ అభిమానులు నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం ఖాయమంటున్నారు. అయితే ఈ సినిమాకు వ్యతిరేకంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీర్ నెగెటివ్ గా ప్రచారం చేయిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

చరణ్ ఎప్పటికీ అలా చేయడు
ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నాడు? అని చెర్రీ అభిమానులు ఆరా తీస్తున్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ఇద్దరు హీరోలకు పడటంలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి రామ్ చరణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించడంలాంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ తిరిగి అటువంటి పనులు చేయడంలేదని అభిమానులు చెబుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా, ఒకరిని కించపరిచేలా తమ హీరో అలా వ్యవహరించడని, చిరంజీవి-సురేఖ దంపతులు అంత గొప్పగా చెర్రీని పెంచారని చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు స్టార్ హీరోలే. గతంలో చాలా క్లోజ్ గా ఉండేవారు. అటువంటిది ఏ విషయంలో గొడవైందనే విషయం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.

Which star hero is spreading negative publicity about Ram Charan s Peddi movie

తప్పంతా ఆ హీరోదే
పెద్ది సినిమాపై ప్రచారం చేయిస్తున్న హీరోదే తప్పు అని తెలుగు సినీ పరిశ్రమలోని వర్గాలు అంటున్నాయి. గొడవకు కారణమైన సంఘటన చాలా తక్కువమందికి మాత్రమే తెలుసని, ఆరోజు నుంచి ఈరోజు వరకు వారు మాట్లాడుకోవడంలేదని, అయితే ఇటీవల రెండు మూడు సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా కలుసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి సినిమాను చంపించేందుకు నెగెటివ్ ప్రచారం చేయించడానికి డబ్బులు కూడా భారీగా ఖర్చుపెడుతున్న ఆ హీరో.. తన సినిమా వచ్చినప్పుడు ఇతరులు మాత్రం ఎందుకు చేయకుండా ఉంటారు? అనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాడంటున్నారు. చాలామంది నెటిజన్లు ఆ హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+