Fact Check : ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల్లో 10మార్కులొచ్చినా పాస్ అయ్యారా ? వాస్తవం ఏంటి ?

ఏపీలో తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 67.26 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే 71 స్కూళ్లలో చదువుతున్న 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అయితే ఉత్తీర్ణతా శాతం భారీగా తగ్గడంపై ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి. దీనికి కరోనాయే కారణమంటూ ప్రభుత్వం వివరణ ఇస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ఫలితాల్లో పది మార్కులు వచ్చిన వారిని కూడా పాస్ చేశారంటూ మరో విమర్శ వినిపిస్తోంది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేస్తే...

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కొందరు విద్యార్ధులకు 10 మార్కులు వచ్చినా పాస్ చేశారనే అంశం వాస్తవమేనని తేలింది. అయితే దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయ. నిబంధనల ప్రకారమే ఇలా పది మార్కులు వచ్చిన వారిని కూడా పాస్ చేసినట్లు తేలింది. అయితే ఇలా పది మార్కులు వచ్చినప్పటికీ పాస్ అయిన అదృష్టవంతులెవరనే చర్చ సాగుతోంది. దీని గురించి ఆరా తీస్తే వీరంతా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులే అని తేలింది. వీరికి నిబంధనల ప్రకారం 10 మార్కులు వస్తే చాలు పాస్ చేసేస్తారు.

Fact Check : students passed with 10 marks also in ap ssc exams 2022 ?

మార్కుల మార్గదర్శకాల ప్రకారం నిర్దిష్ట వైద్య పరిస్థితులు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు మంజూరు చేస్తారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడం శోచనీయం. దయచేసి తప్పుదారి పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు ధృవీకరించాలని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన ఫ్యాక్ట్ చెక్ లో కోరింది. దీంతో సాధారణ విద్యార్ధులెవరూ ఇలా 10 మార్కులు తెచ్చుకుని పాస్ కాలేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఈ ఫేక్ ప్రచారానికి తెర పడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Fact Check

వాదన

ఏపీ పదో తరగతి పరీక్షల్లో 10 మార్కులు వచ్చిన వారిని కూడా పాస్ చేశారు.

వాస్తవం

ఏపీ పదో తరగతి పరీక్షల్లో 10 మార్కులు వచ్చిన వారు పాసయ్యారు. కానీ వారు ప్రత్యేక అవసరాలు కలిగిన వారు. నిబంధనల ప్రకారమే వారిని పాస్ చేసారు.

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+