వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచార నిరోధక చట్టం: నామకరణ క్రీడ

By Pratap
|
Google Oneindia TeluguNews

Anti-Rape Legislation in India: The Name Game
ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి పేరు బయటపెట్టాలా? మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ సూచనకు అనుగుణంగా బాధితురాలి గౌరవార్థం తల్లిదండ్రుల అనుమతితో పటిష్టపరుస్తున్న అత్యాచార నిరోధిక చట్టానికి పేరు పెట్టడానికి వీలవుతుందా?

విషయం చాలా సంక్లిష్టమైంది..

బాధితురాలి పేరు, ఆమె సహచరుడి పేరు బయటపెట్టకుండా భారత మీడియా ఇప్పటి వరకు సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆమె పోరాట స్ఫ్రూర్తిని వర్ణించడానికి ఆమెకు నిర్భయ, అమానత్, దామిని వంటి పేర్లను ఇచ్చారు. మీడియా థరూర్ ట్వీట్‌ను ట్విస్టు చేసింది. థరూర్‌కు మాత్రమే ఆమె పేరును వెల్లడించాలనే ఆసక్తి ఉన్నట్లు పూత పూసింది. తద్వారా మీడియా అనవసరమై వివాదానికి పాదులు వేసింది. థరూర్ ఆ విధమైన సూచన చేయడానికి వెనక గల స్ఫూర్తి ఏమిటనేది మీడియా వివరించలేకపోయింది. చట్డాలకు వ్యక్తుల పేర్లను జోడించే సంప్రదాయం అమెరికాలో ఉంది. చట్టాల సవరణకు మానవ కోణాన్ని జోడించడం అందులోని స్ఫూర్తి.

అయితే, భారతదేశంలో చట్టానికి బాధితురాలి పేరు పెట్టకపోవడమే మంచిది. మీడియా వ్యవహారం నుంచి ఆ పాఠం నేర్చుకోవాల్సి ఉంది. అత్యాచార నిరోధక చట్టానికి బాధితురాలి పేరు పెడితే అత్యాచార బాధితుల పేర్లను బయటపెట్టడానికి మీడియాకు లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. దానివల్ల బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఎనలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది. భారతదేశంలో పాటించే విలువల దృష్ట్యా బాధిత కుటుంబాలపై పేర్లు బయటపెడితే పడే మచ్చ భరించరానిదిగా ఉంటుంది.

మరో ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుత అత్యాచార నిరోధక చట్టానికి ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి పేరు పెడితే, భవిష్యత్తులో రాజకీయ పార్టీలు వివిధ చట్టాలకు వారి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పేర్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ అసలు విషయాన్ని పక్కన పడేసే అవకాశం ఉంది. దానివల్ల చర్చనీయాంశం కాకూడని అంశం ప్రధాన చర్చకు దారి తీసే ముప్పు ఉంది. దానివల్ల పార్లమెంటులో అనవసరమైన చర్చలు జరిగి, అసలు విషయాలు పక్కకు పోయే ప్రమాదం ఉంది.

చాలా మంది వ్యాఖ్యాతలు అమెరికాలోని మెగన్స్ లాను ఉదహరిస్తున్నారు. విడుదలైన సెక్స్ అఫెండర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన చైల్డ్ పేరు మీద ఈ చట్టానికి నామకరణం చేశారు. అమెరికాలో చట్టాలకు ఎలా పేర్లు పెడతారనే దానికి ఇది ఒక ఉదాహరణ. అమెరికాలో పలు చట్టాలకు వ్యక్తుల పేర్లు పెట్టారు. ఇండియాలో మాదిరిగా కాకుండా అమెరికాలో కాంగ్రెసుపర్సన్స్‌కు, సెనేటర్స్‌కు వ్యక్తిగతంగా ప్రవేశపెట్టి చట్టాన్ని అమోదింపజేసుకునే వెసులుబాటు ఉంది.

భారత విషాద సంఘటన తర్వాత అవమానానికి, నామకరణానికి సంబంధించిన విధానపరమైన చొరవకు మేగన్స్ లా కారణంగానే చొరవ ప్రారంభమైంది. యుకెలో మెగన్సన్ లా వంటి బిల్లు తేవాలనే ప్రచారం న్యూస్ ఆఫ్ ద వరల్డ్ చేపట్టింది. ఈ మీడియా ప్రచారం నేరాలు చేసినవారిని పోలినవారిపై దాడులకు పురికొలిపి హింసకు దారి తీసింది. ఇటువంటి ఆగ్రహం సామూహికమై అవాంఛనీయమైన సంఘటనలకు దారి తీసే ప్రమాదం ఉండి, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.

దశాబ్దం క్రితం మాట - అమెరికాలో మేగన్స్ లా, అమెరికాలో అదే విధమైన చట్టాల ఆమోదం విషయంలో రాజకీయ, మీడియా ప్రక్రియలను నేను పరిశీలించాను. బ్రిటిష్ న్యూస్ వరల్డ్ ప్రచారంతో పోల్చి అమెరికాలో రాజకీయాల ప్రాముఖ్యాన్ని, అమెరికా అనుభవం ప్రాముఖ్యాన్ని, నొక్కి చెప్పదలుచుకున్నాను. ఈ అనుభవాల దృష్ట్యా ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి పేరును (అవసరమైతే నేరం చేసినవారి పేర్లను కూడా) వెల్లడించకపోవడమే సరైంది. నేరాలను నిరోధించడానికి పాలనను మెరుగు పరిచి, సామాజిక వైఖరులను మార్చడానికి చేసే ప్రయత్నాలకు పేర్లను వెల్లడించడం వల్ల విఘాతం కలుగుతుంది.

థరూర్ మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యల అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా ట్విస్టు చేయడం వల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చాయో, చట్టాలకు వ్యక్తుల పేర్లను పెట్టడం వల్ల అటువంటి ప్రతికూల ఫలితాలే వచ్చే ప్రమాదం ఉంది.

- రాజీవ్ గౌడ
రచయిత బెంగళూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ చైర్‌పర్సన్, ఆర్థిక, సామాజిక శాస్త్రాల ఆచార్యులు.

English summary
"Should the Delhi rape victim’s name be revealed? At least for the purpose of honoring her (with her parents consent) by naming revised anti-rape legislation after her, as Union Minister of State for HRD, Shashi Tharoor, has suggested" writes Rajeev Gowda, Professor of Economics and Social Sciences and Chairperson, Centre for Public Policy at the Indian Institute of Management, Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X