వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: అతడు-ఆమె

|
Google Oneindia TeluguNews

ఏమిటో ఆవెనకటి రోజులు... ప్చ్.. మళ్లీ రావు కదా అంది ఆవిడ.

ఏ రోజులు గురించి మాట్లాడ్తున్నావు పైగా.. ప్చ్... అని కూడా అంటున్నావు అన్నాడు అతను.

ఆ రోజులే.. ఇట్లా కూచున్న చోట్నించి కదలకుండా వుండని రోజులు. అప్పుడప్పుడూ అలా అలా గగన విహారం చేస్తూ భూమ్మీద మనుషుల కష్టాలు గమనిస్తూ వాళ్లకి సాయం చేస్తూవుండే వాళ్లమే.. ఆ రోజులన్న మాట.

ఆ రోజులు మళ్లీ రమ్మంటే వస్తాయా? మరి.. గగన విహారాల జమానా వెళ్లిపోయింది సుమా. ఇప్పుడు భూమ్మీద ఎక్కడ చూసినా గందరగోళమే కదా. ఇక వాళ్ల కష్టాలకు ఓ కామా పులిస్టాపూలేవు వాటిని ఆర్చటం కానీ తీర్చడం కానీ మనవల్ల కాని పని అందువల్ల మన జాగాలో మనం వుంటం ఆ గోళంలోకి పోకుండా వుంటం మనకే సేఫ్

మీరెప్పుడూ ఇంతే.. ఒక్కసారి అట్లా అట్లా మబ్బుల మధ్య తీపి కబుర్లు చెప్పుకుంటూ భూమ్మీదకి పిక్నిక్ వెళ్లొద్దాం సరిగమ సరదాయాత్ర చేసివద్దాం.

chintapatla sudarshan column on the Valentines day

వాళ్ల ప్రాబ్లమ్స్ వాళ్లకి వున్నయి కదా. మనం వాటిని ఎట్లాగూ సాల్వు చెయ్యలేం. ఎందుకు అక్కడికి వెళ్లి మనం ప్రాబ్లంలో యిరుక్కోవడం

మనకి ప్రాబ్లమ్సా! ఊరుకోండి అందామె నవ్వుతూ. కదుల్తారా లేదా అని సూటిగా ఘాటుగా అంది.. ఆమె. ఆమె నవ్వుకి ఐసుగడ్డల మధ్య నిత్యం గడిపే ఆయన కూడా ‘అయిసు' అయిపోక తప్పలేదు.

ఆహా! ఎంత బావుందండీ ఈ భూలోకం.. అంటూ కళ్లు పెద్దవి చేసి ప్రతిదీ ఎంజాయ్ చెయ్య సాగింది ఆమె.

పొరుగింటి పుల్లకూరే కాదు పొరుగిల్లన్నా ఇష్టం కొందరికి అనుకున్నాడతను. లేకపోతే ఏమిటి తాము వుండే అందమైన అద్భుతమైన చోటికీ ఈ ‘అర్తు'కీ ఓ పోలికా. మనుషులూ కాలాలూ రుతువులూ ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో తెలియని చోటు కదా యిది అనీ అనుకున్నాడతను.

అటు చూడండి ఎంత పెద్ద తోటో.. ఎన్ని రకాల చెట్లో... ఎంత చల్లగాలో అంటూ ఆనందపారవశ్యంతో తేలిపోతూ అన్నది ఆమె. కాస్త కిందకి దిగి ఆ పచ్చని చెట్ల మధ్య ఆ రంగు రంగుల పూల వనంలో హాయిహాయిగా చేయీ చేయీ పట్టుకు తిరిగొద్దాం పదండి ఎంతసేపూ ఈ మబ్బుల్ని చూసి చూసి బోరుకొడ్తున్నది అంటూ కిందకి దిగసాగింది ఆమె. ఆమెని అనుసరించక తప్పలేదు అతగాడికి.

అంచులదాకా నీళ్లు నిండిన బిందెలాగా వుంది చెరువు. చెరువుని ఆనుకుని ఉన్న ఉద్యానవనంలో పచ్చిని చెట్లూ, గుబురుగా వున్న పొదలు ‘క్యాట్‌వాక్' చేస్తున్న చల్లగాలి.

ఆమే అతనూ అలా ఆ చెట్ల మధ్య తిరుగాడి ఓ చోట పచ్చికలో కూచున్నారు. ఆ పక్కనే పొదలో ఏదో కదలిక ఎవరో మాట్లాడుతున్నారు. మాటలు వినపడ్డయి.

ఐ లవ్ యూ అన్నది మగగొంతు
ఐ టూ లవ్ యూ అన్నది ఆడగొంతు
ఐత్రీ లవ్ యూ అన్నది మళ్లీ మగగొంతు
అతను ఆవిడ వైపు చూశాడు ఆవిడ అతని వైపు చూసింది. పక్కన పొదలో ఎవరో వున్నారు. వాళ్లెవరు? ఏం మాట్లాడుతున్నారు అంది ఆవిడ.

వినపడిందా? ఒక ఆడ ఒక మగ. వాళ్లిద్దరూ లవ్వూ.. టూ లవ్వూ.. త్రీ లవ్వూ చేసుకుంటున్నారు అన్నాడతను చిరునవ్వు నవ్వుతూ.

నాకూ ఇంగ్లీషు వచ్చు నాకూ లవ్వు అంటేనూ తెల్సును అందామె.

తెల్సీ అడుగుతావని నాకూ తెల్సు. మనం ఇక్కడవుంటే వాళ్లకు యిబ్బంది కాస్త అటువైపు వెళ్లి కూచుందామా అని లేచాడు అతను. ఈసారి అతన్ని అనుసరించింది ఆమె.

ఇద్దరూ ఓ చోట కూచున్నారు. కాస్సేపు ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నారు. గతంలో అనుభవించిన మధురక్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. సడన్‌గా ఆమె చూపు కొద్ది దూరంలో ఉన్న ఒక దృశ్యం దగ్గర వేలాడి ఆగిపోయింది.

ఊగి అన్నాడబ్బాయి
ఊహూ అంది అమ్మాయి
అమ్మాయి ఒడిలో అబ్బాయి తలవుంది. అబ్బాయి చెంపల మీద అమ్మాయి అరచేతులు ఉన్నాయి. అబ్బాయి చూపులు అమ్మాయి చూపుల్ని గుచ్చుతున్నయి.

అబ్బాయి ఎందుకో ఊ అన్నాడు అమ్మాయి ఎందుకో ఊహూ అంది.. అనుకుంది ఆమె అతని చూపుడు వేలిని తన చేతిలోకి తీసుకుని ముందుకి చాపి తన చూపులు వేలాడ్తున్న చోట్ని చూపింది ఆమె.

అరెరే ఇక్కడా అబ్బాయీ అమ్మాయీ వున్నారు లే.. లే.. పద.. మరెక్కడికయినా వెళ్లిపోదాం అన్నాడతను.

ఏమిటో ఈ మనుషులు.. వేరే పనులంటూ వుండవా వీళ్లకి.. జంటలు జంటలుగా ఇలా గార్డెన్‌లు పట్టి తిరుగుతుంటారా అనుకుంటూ లేచిందామె. ఎక్కడికెళ్దాం అన్నట్టు చూసిందామె అతన్ని. నీ ఇష్టం అన్నట్టు చూశాడతను ఆమెని. ఈసారి ఆమె ముందుకు కదిలింది. అతను ఆమెను అనుసరించక తప్పదు కదా అని అనుసరించాడు.

మరోచోట ఆమె మాట్లాడుతుంటే అతని చూపు ఓ చెట్టు వెనక మగవీపును చుట్టుకున్న ఆడ చేతులపై పడింది. అక్కడ కూడా నిశ్చితంగా కూచోలేకపోయారు అతనూ ఆమే.

ఆ తరవాత వాళ్లు ఎటు వెళ్లినా ఇద్దరిద్దరు ఇద్దరేసి చొప్పున ఆ ఇద్దరికీ కనిపించసాగారు. పొదలు కదుల్తున్నాయి, ఆకులు ఫట్ ఫట్ మంటున్నయి, చెట్లు గుసగుసలాడ్తున్నయి.

నందనవనంలో గంధర్వులూ, కిన్నెరులూ, కింపురుషులూ జంటలు జంటలుగా జాయ్ జాయ్‌గా కనిపిస్తున్నారిక్కడ.. చూసింది చాలు.. యిక వెళ్లిపోవడమే మేలు అన్నాడతను. అవును అన్నట్టు తలాడించిదామె, యిదివరకు లేని అలవాటుని కొత్తగా ఆరంభిస్తూ.

ఇంతలో ఏదో గోల మొదలయ్యింది. చేతిలో కర్రలతో ఒక గుంపు తోటలోకి జొరబడ్డది. ఆ గుంపులోని వాళ్లంతా ఏవో ఏవేవో కేకలు పెడ్తున్నారు. పొదల్లోంచి అబ్బాయిల్నీ అమ్మాయిల్నీ బైటికి లాక్కొస్తున్నారు.

అసలేం జరుగుతున్నదో అర్థం కాక నిలబడ్డ చోటే నిలబడిపోయారు అతనూ ఆమే.

ఈళ్లందరికీ ఇప్పుడే ఇక్కడే పెళ్ళిళ్లు చేసేద్దాం అని అరుస్తున్నాడొకడు.

అబ్బాయిల అమ్మాయిల ముఖాలు వెలవెలబోతున్నయి. ఆందోళనలో అబ్బాయిలూ ఏడుపుకి మిల్లీమీటర్ల దూరంలో అమ్మాయిలూ వున్నారు.

లవర్స్ డే కదా అని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చాం అన్నాడో అబ్బాయి ధైర్యం చేసి ‘లవ్వాగివ్వా' అని వురిమాడో మగ పురుషుడు.

వాలెంటైన్సుడే మన సంస్కృతి కాదు.. ప్రేమ మన ఇంటావంటా లేదు.. వుంటే గింటే పెళ్లే అనరిచాడాడింకొకడు.

మేం ఒకళ్లనొకళ్లని అర్థం చేసుకుంటున్నాం ప్రేమ గురించి తెల్సుకుంటున్నాం. ఒకళ్లను గురించి ఒకళ్లకు పూర్తిగా అర్థమయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం అందామనుకుంది ఓ అమ్మాయి కానీ మాట పెగల్లేదు.

మేం ప్రేమించుకుంటాం.. ప్రేమతింటాం.. తాగుతాం.. ప్రేమ కోసం బ్రతుకుతాం, ఛస్తా.. ప్రేమా పెళ్లీ మా ఇష్టం.. రాజకీయాలకిందులో చోటులేదు అందామనుకున్నాడో అబ్బాయి కానీ వాయిస్ సహకరించలేదు. ఇదంతా చూస్తూ నిలబడ్డ అయిన్నీ ఆమెనూ కూడా ఓ గుంపు చుట్టుముట్టింది.

మీరు కూడా లవర్సే కదా.. మీకూ పెళ్లి చేస్తాం అన్నాడొకడు.

కాదు కాదు అందామనుకుంది ఆమె అవును కదా అనుకుంది ఆమె మాకు ప్రేమా పెళ్లీ రెండూ అయినవి అనుకుందామె.

అతను మాత్రం చిరునవ్వు చెదరనీయలేదు. ప్రతియేడు మా పెళ్లి చేసీ చూసీ సంతోషిస్తూ నేవుంటారు గదా అనుకుంటూ.

ప్రేమ అనేది సృష్టికి అవసరం. ప్రేమ లేకుండా ఈ ప్రకృతీ లేదు ప్రపంచమూ లేదు. పెళ్లి కంటే ప్రేమే ముఖ్యం. ఒకళ్లు బంధిస్తే బందిఖానా, ఎవళ్లయినా స్వచ్ఛందంగా బందీలయ్యేది ఒక్క ప్రేమ కోసమే.. దౌర్జన్యానికి లొంగనిది ఒక్క ప్రేమ మాత్రమే అన్నాడు.

ఏ సినిమా డైలాగులివి అన్నాడొకడు కర్ర ఎత్తుతూ. ఎత్తిన కర్ర ఎత్తినట్టేవుంది గుంపులో జనమూ అబ్బాయిలూ అమ్మాయిలూ ఒక పెద్ద ఫొటో ఫ్రేములో యిరుక్కుపోయారు.

చెప్పాను కదా భూమ్మీదకి వెళ్తే ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్ అని మబ్బుల మధ్య గజానికో అడుగువేస్తూ గబగబా నడుస్తూ అన్నాడను కైలాసవాసీ, సదాశివా, తాపసీ వస్తున్నా వస్తున్నా ఏమిటా స్పీడు అంటూ అతన్ని అనుసరించింది ఆమె.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about the Valentines day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X