వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం' : ద్వారపాలకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

జయవిజయులన్జెప్పి ఇద్దరు జంట ద్వారపాలకులు వైకుంఠం మెయిన్‌గేటు దగ్గర కాపలా కాసుంటారని మనం పురాణాల్లో చదివాం... సప్తమహర్షులో మాటు విష్ణుమూర్తులవారిని చూద్దామని వచ్చేసరికి... బాస్‌ కాన్ఫిడెన్షియల్‌ కార్యక్రమాల్లో వున్నారు... మీరెళ్లడానికి వీల్లేదు అని అడ్డగించారు. దాంతో రుషులకి చిర్రెత్తిపోయి... శాపం పెట్టేశారు... రోగం తిరిగింది... గేటుకీపర్లు... గేటుకీపర్లలాగుండాలి గానీ ఇంటి ఓనర్‌లాగ ప్రవర్తిస్తే అంతే!

సరే అప్పుడంటే వాళ్ళకి ఆ పవర్సు వుండేవి... కోపాలొచ్చిన వెంటనే శాపాలెట్టేసేవారు... కానీ ఇప్పటి రోజులు వేరు... ముఖ్యంగా గేటుకీపర్ని తల్చుకున్నప్పుడల్లా నాకు గవర్నమెంటు ఆస్పత్రి ముందుండేవాళ్ళే గుర్తుకొస్తారు... ప్రతి ఆస్పత్రికీ కొన్ని విజిటింగ్‌ అవర్స్‌ వుంటాయ్‌... ఆ సమయాల్లో వెళితే ఫర్వాలేదు... అంతేగానీ... ఎప్పుడైనా ప్రాణంమీదికొచ్చి పొద్దున్నో మజ్జాన్నమో... వెళ్ళామో చచ్చామే... వాడు ముందు పురుగును చూసినట్లు చూస్తాడు... మాట్లాడితే చాలు ... డాక్టర్లు రౌండ్సు కొడ్తున్నారంటాడు... అంత రోజంతా రౌండ్లు ఎందుకొడ్తారో నాకర్థంకాదు... అసలు విషయం ఏమిటంటే కుడిచెయ్యి చూపిస్తాడు... అందులో పావలానో అర్ధో పడేస్తే... వెంటనే ''ఓపెన్‌స సేమ్‌'' అన్నట్టు ప్రవేశద్వారం తెరుచుకుంటుంది... వాడికి జీతంకన్న ఈ గేటు ''కాపర్సే'' ఎక్కువ వస్తాయేమో!

Tanikella Bharani

సరే డబ్బున్నవాడు అలా ఇస్తుపోతాడు... ఆ మాత్రంకూడా డబ్బులేనివారు... అలా చూస్తో బతిమాలుతారు... ఈ చెయ్యిజాపుడు వాళ్ళకి ఎంత అలవాటైపోయిందంటే... ఆఖరికి పొరపాటున డాక్టర్లు సివిల్‌ డ్రస్సులో వస్తే వారిముందు కూడా జాపేస్తారు. అంటే అది నేరం అనే విషయం మర్చిపోయి హక్కుగా మార్చుకున్నారు... అయినాసరే ఎవ్వరూ కంప్లయింట్‌ ఇవ్వరు... ఇచ్చినా... ఎవ్వరూ పట్టించుకోరు... పోనివ్వకపోతే ఎవర్నీ పోనివ్వకూడదు... అంతేగాని... గంటకింత అని రేటుపెట్టి మరీ వసూలు చెయ్యడం ఘోరం!... అయినా అసలు బుద్ధితక్కువ మనదీ... వేళగానివేళ వెళ్లి నానా యాతనపడటం ఎందుకూ... అలాగే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటిముందు... అరగజం పొడుగు కత్తి బొడ్లో దోపుకుని వుంటాడొకడు... వాణ్ణి ఘోర్కా అంటాం... వాణ్ణి ఎప్పుడడిగినా సాబ్‌ నహీ అనే అంటాడు.

బహుశా మనభాష అర్థంకాక కాబోలు... సరే మనుషులు ఇంతే... ఈ వృత్తికి కుక్కల్నికూడా పెట్టుకున్నాం... అవి దొంగలొచ్చినా చుట్టాలొచ్చినా ఒకే లెవెల్లో అరుస్తూ వుంటాయ్‌... ఐతే ఒక్క విషయంలో అవ్వే బెటరు... కుక్కలు లంచం పుచ్చుకోవు!

English summary
Tollywood actor and writer Tanikella Bharani writes on gate keepers attitude at hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X