వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సినిమాల్లో తెలంగాణ కవుల జోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nandini Sidha Reddy
తెలుగు సినిమాల్లో తెలంగాణవారికి తగిన ప్రాతినిధ్యం లేదని విమర్శలు రావడం పరిపాటిగా మారింది. అయితే, అదే సమయంలో తెలంగాణకు చెందిన గేయ రచయితలు తెలుగు సినీ రంగంలో తమ జోరు ప్రదర్శిస్తున్నారు. తాజాగా, నందిని సిధారెడ్డికి నంది అవార్డు రావడంతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. సిధారెడ్డి ప్రధానంగా వచన కవి. ఉద్యమ నేపథ్యంతో కవిత్వం రాసే సిధారెడ్డికి ఉత్తమ గేయ రచయిత అవార్డు రావడం విశేషమే. ఆయన వీర తెలంగాణ సినిమాలో రాసిన నాగేటి చాళ్లల నా తెలంగాణ పాటకు అవార్డు వచ్చింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆ పాట మారు మోగింది. దాన్నే సినిమాకు వాడుకున్నారు. సిధారెడ్డి జై బోలో తెలంగాణకు కూడా ఓ పాట రాశారు. తెలుగు సినిమాకు తెలంగాణ అందించిన మరో కవి సిధారెడ్డి.

దాశరథి,త డాక్టర్ సి. నారాయణ రెడ్డి వంటి తెలంగాణ కవులు తెలుగు సినిమా గేయ కవిత్వానికి కొత్త సొబగులు, కొత్త అందాలు తెచ్చి పెట్టారు. తెలంగాణ, ఉర్దూ భాష సౌందర్యాన్ని తెలుగు సినిమాకు అద్దారు. ఆ తర్వాత తెలుగు సినీ రంగానికి పలువురు గేయ రచయితలు తెలుగు సినీ తెరకు పరిచమయ్యారు. అశోక్ తేజ తెలుగు సినిమా గేయ రచయితల్లో ప్రముఖంగా వెలుగొందుతున్నారు. ఆయన రాసిన పాటలకు కూడా అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమాకు తెలంగాణ, నక్సలైట్ ఉద్యమం కూడా కథావస్తువులు కావడంతో తెలంగాణ ఉద్యమ కవులకు సినిమాల్లో చోటు లభించింది. మా భూమి ద్వారా గద్దర్ వంటి కవులు ముందుకు వచ్చారు. తెలుగు సినిమాల్లో గద్దర్ పాటలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. జై బోలో తెలంగాణ సినిమాలో గద్దర్ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

చంద్రబోస్ లాంటి కవులు కూడా తెలుగు సినిమా రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గూడ అంజయ్య, మాస్టర్జీ వంటి కవుల పాటలు కూడా తెలుగు సినిమాలకు వాడుకున్నారు. నారాయణమూర్తి సినిమాల్లో తెలంగాణ ఉద్యమ కవుల పాటలు తప్పకుండా ఉంటాయి. అందెశ్రీ, గోరటి వెంకన్న పాటలు తెలుగు సినిమా సాహిత్యాన్ని మరింత విస్తృతం చేశాయి. అందెశ్రీ కూడా అవార్డు అందుకున్నారు. మైసమ్మో మైసమ్మ పాట తెలుగులో మారు మోగిన పాట. దాన్ని రాసింది ఓ తెలంగాణ కవే. ఇంకా చాలా మంది కవులు తెలుగు సినీరంగంలో తమ ఉనికిని చాటుతున్నారు.

English summary
Telangana poets are playing prominent role in Telugu cine industry. Fresh example is poet Nandini Sidha Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X