వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాక్షసత్వానికి చెక్: కెమికల్‌తో నపుంసకత్వం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress anti-rape draft bill proposes 30 years jail, chemical castration
అత్యాచార ఘటనలో నిందితులకు ముప్పై ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించింది. న్యూఢిల్లీలో బస్సులో గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో యువత కదం తొక్కింది. మహిళా సంఘాలు అత్యాచారాలను నిరోదించే చట్టం తేవాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులకు కఠిన శిక్షలు వేసే దిశలో పావులు కదులుతున్నాయి. అందులో భాగంగా కాంగ్రెసు పార్టీ ఓ ముసాయిదా రూపకల్పన చేసింది.

అందులో అత్యాచార నిందితులకు ముప్పై ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని, అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు రసాయన ప్రక్రియ ద్వారా వారిలో లైంగిక కాంక్షను, విపరీతమైన లైంగిక ప్రవృత్తిని సమూలంగా నాశనం చేయాలని గట్టిగా కోరింది. రసాయనిక సూది మందుతో వంధ్యత్వం కలుగక పోయినప్పటికీ దీని ప్రభావం వల్ల లైంగికపరమైన కోరికలు ఉత్పన్నమయ్యే ప్రసక్తే ఉండదు. తద్వారా వారిని నపుంసకులుగా చేయాలని సూచించింది.

మూడు నెలల్లో తేల్చేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, బాల నేరస్తుల వయోపరిమితి 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించాలని సూచించింది. దీనిని ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ జెఎస్ వర్మ కమిటీకి సమర్పించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనుంది. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశముంది. ఈ ముసాయిదా చర్చల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.

బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలని, బాల నేరస్తుల వయసు పరిమితిని మరింత తగ్గించాలని సూచించింది. వయో పరిమితిని తగ్గించాలని ముసాయిదాలో ఉంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితుల్లో అత్యంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారిలో ఒకడు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నాడు. స్పృహ తప్పిన తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే బాల నేరస్తులుగా పరిగణించే వయసును 15 ఏళ్లకు కుదించాలని కొంత మంది ప్రతిపాదించారు.

అయితే ఈ ప్రతిపాదనలకు న్యాయపరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దీనిపై ఆర్డినెన్స్ తీసుకు వస్తారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరో రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఈలోపులోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి, బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రేప్ చేస్తే నపుంసకులుగా మార్చే విధానం ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉందట.

English summary
Congress in a draft bill for a tougher law to check crimes against women has proposed imprisonment of up to 30 years which could also include chemical castration in rare cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X