ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై టూ ఖమ్మం... పావురాల రేసింగ్..

బైకు రేస్, కార్ల రేస్ తెలుసు. గుర్రాల రేస్ తెలుసు. పావురాల రేస్ గురించి తెలుసా? ఇది, వందల ఏళ్లనాటి క్రీడ. నిజాం కాలంలో ఇది ఉండేది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: బైకు రేస్, కార్ల రేస్ తెలుసు. గుర్రాల రేస్ తెలుసు. పావురాల రేస్ గురించి తెలుసా? ఇది, వందల ఏళ్లనాటి క్రీడ. నిజాం కాలంలో ఇది ఉండేది. ఇది ఇప్పడు కూడా చెన్నైలో కొనసాగుతోంది. అక్కడి నుంచి బయల్దేరిన ఓ పావురం.. అలసిసొలసి ఇటీవల ఖమ్మంలోని షాదీఖానా వద్ద ఓ రోజు రాత్రిషాదీఖానా వద్ద అస్వస్థతతో పడిపోయింది. దానిని చూసిన స్థానికులు అది రేసింగ్‌ పావురంగా గుర్తించి, జిల్లాలో ఎన్నో ఏళ్ల క్రితం కనుమరుగైన పావురాల పోటీలను గుర్తుచేసుకున్నారు.

బైక్‌ రేసింగ్‌, కార్‌ రేసింగ్‌, గుర్రం రేసింగ్‌ ఇవన్నీ వినే ఉంటాం. కానీ కొన్ని వందల ఏళ్లక్రిందట పావురాల పోటీ ఉండేది. ఖమ్మం నగరంలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనతో నిజాం కాలంలోని పోటీలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఖమ్మం షాదీఖానా సమీపంలో మంగళవారం రాత్రి ఓ పావురం అస్వస్థతకు గురై ఓ కారు కింద పడి ఉండడాన్ని స్థానికులు కొందరు చూసి ఎదురుగా ఉన్న పాన్‌ షాపు యజమాని సయ్యద్‌కు అప్పగించారు. అతను పావురం కాళ్లకు ఉన్న రింగ్‌లు చూసి ఆశ్చర్యపోయాడు. షాపు వద్దకు వచ్చిన వారికి చూపించగా అది రేసింగ్‌కు సంబంధించిన పావురంగా గుర్తించి దానిపై ఉన్న నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలిపారు.

రేసింగ్‌లో రారాజులు...

పావురాల రేసింగ్‌లకు సంబంధించి ప్రత్యేకంగా క్లబ్‌లు కూడా ఉన్నాయి. పావురాల ఓనర్స్‌ని ఫాన్సీయస్‌ అంటారు. కొందరు ఈ పావురాల రేస్‌లను హాబీగా ఎంచుకుంటారు. ఆయా పావురాల్లో అనేక జాతులు ఉన్పటికీ తుగిడి, హోమర్‌, టంబ్లర్‌లు రేసింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. హోమర్‌ డిస్టెన్స్‌ రేస్‌లో పాల్గొంటే, టంబ్లర్‌ తన ఓర్పును తట్టిచూడమంటుంది. ఇక తుగిడి గుంపుల పోటీలో ఇది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిజాం కాలం తర్వాత కనుమరుగైన ఈ పావురాల రేసింగ్‌ హైదరాబాద్‌తోపాటు, బెంగుళూరు, చైన్నై, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం చాలా పాపులర్‌. హైదరాబాద్‌ క్లబ్‌ వారు నిర్వహించే రేసింగ్‌లకు ఆదిలాబాద్‌, నిర్మల్‌, బోపాల్‌ వంటి ప్రదేశాలు ఎంచుకుంటారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పావురాలను రేసింగ్‌ ప్రదేశానికి పంపుతారు.

Chennai Too Khammam ... Pigeons Racing ..

రేసింగ్‌ ఇలా...

రేసింగ్‌లో పాల్గొనే ప్రతి పావురానికి రింగ్‌ నంబర్లు, కేటగిరీలు ఉంటాయి. రేసింగ్‌లో పాల్గొనే పావురాలను ముందుగా రేసింగ్‌ ప్రారంభించే ప్రదేశానికి తీసుకెళ్తారు. ఆయా పావురాలకు ఉదయమే మంచినీరు తాగించి వదిలేస్తారు. రేసింగ్‌లో పాల్గొన్న పావురాల యజమానుల ఇళ్లలో రిఫరీలు ఉంటారు. పావురం ఏ సమయానికి వచ్చిందో చూసి దూరాన్ని బట్టి వేగాన్ని గుర్తిస్తారు. ముందుగా చేరుకున్న పావురాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎంత దూరంలో వదిలేసినా... ఇవి ఇంటికి తిరిగి వచ్చేస్తాయి. వాటికి కావాల్సిందల్లా వాటికి దారి చూపే టెక్నిక్‌ మాత్రమే.. కొన్నిసార్లు యేడాది తర్వాత కూడా ఇంటికి తిరిగి రావచ్చు. కాగా ప్రస్తుతం నిర్వహించే రేసింగ్‌లో కుతుబ్‌షాహీల కాలంలో ఉన్న నిబంధనలే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

రేసర్లు. పావురాల రేసింగ్‌లో పాల్గొనేవారు కచ్చితంగా పావురాల ప్రేమికులు అయి ఉండాలనే నిబంధన ఉంది. వెయ్యి నుంచి 1500 కిలోమీటర్ల వరకు రేసింగ్‌ నిర్వహిస్తుంటారు. మూడు నెలల వయసు నుంచే ట్రైనింగ్‌ను ప్రారంభిస్తారు. అలా యేడాదిపాటు ఇంటి చుట్టూ తిప్పుతారు. పావురాలు రేసింగ్‌కు పనికి వస్తాయా? లేదా అన్న విషయాన్ని ఆయా పావురాల కళ్లను చూసి చెబుతారు. రేసింగ్‌లో పాల్గొనే పావురాలకు పది రకాల ధాన్యాలు, జొన్నలు, మొక్క జొన్నలతోపాటుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్లు కూడా ఇస్తారు. ఆయా పావురాలకు సంబంధించి రెండు రింగ్‌లను కాళ్లకు తగిలిస్తారు. ఒకటి క్లబ్‌కు సంబంధించినవి, ఇంకోటి పావురం వయస్సుకు సంబంధించినది. మరో రింగ్‌లో ఓనర్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి.

దాని ఆధారంగానే ఆ పావురం ఎవరిది అన్న విషయాలను గుర్తించవచ్చు. అస్వస్థతకు గురైన పావురం చైన్నైలోని ఓ రేసింగ్‌ క్లబ్‌కు చెందినదగా గుర్తించారు. ఆయా పావురానికి ఉన్న రింగు ఆధారంగా ఆ పావురం యజమానికి ఫోన్‌ చేసి వివరాలు తెలిపారు. ఆ పావురాన్ని, ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్న పావురాల ప్రేమికుడు షఫీ తన ఇంటికి తీసుకెళ్లి సంరక్షిస్తున్నారు.

English summary
The pigeons race, which was popular in Nizam era is still continuing in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X