స్టీఫెన్ హాకింగ్: అప్పుడు మృత్యుదేవత తలవాల్చింది

Posted By:
Subscribe to Oneindia Telugu
  Stephen Hawking Lost Life చక్రాల కుర్చీకే అతుక్కుపోయినా ఆత్మస్థైర్యంతో పరిశోధనలు

  లండన్: ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అటువంటి స్థితిలో మరో వ్యక్తి అయితే ఎప్పుడో కుప్పకూలిపోయేవాడు. కానీ ఆయన తన మొక్కవోని ధైర్యంతో మనుగడ సాగించడమే కాకుండా ప్రపంచం మర్చిపోలేని పరిశోధనలు చేశాడు.

  మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా కూడా ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేసి విశ్వవిఖ్యాతి గడించారు. విధి వెక్కిరస్తుంటే దానికి ఎదురొడ్డి అమేయమైన ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు సాగారు.

  మనం ఇలా పిలుస్తున్నాం

  మనం ఇలా పిలుస్తున్నాం

  సైద్దాంతిక భౌతిక శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా పనిచేశారు. ఆయన ప్రతిపాదించిన బ్లాక్ హోల్స్ రేడియేషన్‌ను హాకింగ్స్ రేడియేషన్గా పిలుస్తున్నాం. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి సైద్దాంతిక భౌతిక శాస్త్ర వేత్త ఆయనే.

  ఆయన తండ్రి వైద్య పరిశోధకుడు

  ఆయన తండ్రి వైద్య పరిశోధకుడు

  స్టీఫెన్ హాకింగ్ తండ్రి వైద్యశాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా స్టీఫెన్ తల్లిని ఆక్స్‌ఫర్డ్‌లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి కుటుంబం లండన్‌లోని హైగేట్స్ ప్రాంతానికి తరలిపోయింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు.ఆ తర్వాత 1950లో ఆయన కుటుంబం మిల్‌హిల్ ప్రాంతానికి తరలిపోయింది. అక్కడి సెయింట్ ఆల్బన్స్‌లో ఆయన చేరాడు.

  స్టీఫెన్ ఆశ ఇదీ, కానీ...

  స్టీఫెన్ ఆశ ఇదీ, కానీ...

  తన గణితశాస్త్ర ఉపాధ్యాయుడి ప్రేరణతో స్టీపెన్ హాకింగ్ గణిత శాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామని అనుకున్నారు. కానీ తండ్రి ఆయనను రసాయనశాస్త్ర విభాగంలో చేర్చారు. తర్వాత 1959లో నేచురల్ సైన్స్ విద్యాభ్యాసానికి స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో ఆయన ఉత్తీర్ణులయ్యారు. కానీ భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశారు. 1962లో ఆయన అందులో కేవలం ప్రథమ శ్రేణిలో మాత్రమే పాసయ్యారు. కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ వెళ్లారు.

  అక్కడే ఆరోగ్యం వికటించింది...

  అక్కడే ఆరోగ్యం వికటించింది...

  ఆక్స్‌ఫర్డ్‌లో చేరిన తర్వాత స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భోజనం చేయడానికి గానీ బూట్ల లేసులు కట్టుకోవడానికి గానీ శరీరం సహకరించకుండా పోయింది. క్రిస్మస్ సెలవుల్లో ఇంటికి వెళ్లిన అతని పరిస్థితి చూసి తల్లిదండ్రులు తీవ్రంగా కలవరపడ్డారుఆ సమయంలో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మోటార్ న్యూరాన్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాన్నే Amyotrophic Lateral Sclerosis (ALS)వ్యాధి అని కూడా అంటారు.

  అదెలా ప్రభావం చూపుతుంది...

  అదెలా ప్రభావం చూపుతుంది...

  స్టీఫెన్ హాకింగ్‌కు సోకిన వ్యాధి నాడీమండలంపై ప్రభావం చూపుతుంది. అంటే నరాలు, వెన్నుపూసలపై ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ వచ్చేలోగా ఆయన మరణిస్తాడని అన్నుకున్నారు. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థయిర్యంముందు మృత్యువు తలవాల్సింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగి వచ్చి తన పరిశోధనలు కొనసాగించాడు. ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించేవారు.

  ఆయన వివాహం ఇలా...

  ఆయన వివాహం ఇలా...

  విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమైనమహిళను స్టీఫెన్ హాకింగ్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నప్పుడు దానికి సమీపంలోనే నివాసం ఉన్నారు. తనకు వ్యాధి బాగా ముదిరిన తర్వాత భార్యతో విడాకులు తీసుకున్నాడు. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. ఆ తర్వాత ఆస్పత్రిలో తనకు సేవలు చేస్తున్న ఓ నర్సుతో సహజీవనం చేశారు.

  స్టీఫెన్ హాకింగ్ ప్రసిద్ధమైన కోట్

  స్టీఫెన్ హాకింగ్ ప్రసిద్ధమైన కోట్

  మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం ఓ కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం, నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసంం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కూడా కంప్యూటర్ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పనిచేయడం ఆగిపోయినట్లే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు ఆగిపోయిన తర్ావత ఏమీ మిగలదు. కన్నుమూసేలోపు మనకు ఉన్న శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండడానికి పాటుపడాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలో ఉంటోంది. అయినా కూాడ నేను మృత్యువుకు భయపడడం లేదు. త్వరగా మరణించాలని అనుకోవడం లేదు. నేను కన్నుమూసే లోపుచేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Professor Stephen Hawking has worked on the basic laws which govern the universe. He showed that Einstein's general theory of relativity implied space and time would have a beginning in the Big Bang and an end in black holes.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి