వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేప ప్రసాదం: భారీగా తరలిన ప్రజలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్ రాత్రి 11.50 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన బత్తిని కుటుంబసభ్యులు కౌంటర్లలో ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.

గేట్లు ఒక్కసారిగా తెరవటంతో అప్పటి వరకు ప్రసాదం కోసం బయట వేచి ఉన్న జనం లోనికి పరుగులు తీశారు. కౌంటర్ల వద్ధ వందల సంఖ్యలో జనం చేప పిల్లల కోసం ఒకరిపై ఒకరు పడటంతో తోపులాట జరిగింది. ఫలితంగా పలువురి చేతుల్లోని చిన్నారులు అదుపు తప్పి పడిపోవటంతో స్వల్ప గాయాలయ్యాయి.

చేప మందుతో రోగులు

చేప మందుతో రోగులు

మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే ప్రసాదం సోమవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ప్రారంభమైంది.

రోగుల బారులు

రోగుల బారులు

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన బత్తిని కుటుంబసభ్యులు కౌంటర్లలో ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.

సేదతీరుతున్న రోగులు

సేదతీరుతున్న రోగులు

గేట్లు ఒక్కసారిగా తెరవటంతో అప్పటి వరకు ప్రసాదం కోసం బయట వేచి ఉన్న జనం లోనికి పరుగులు తీశారు.

చేప పిల్లలు

చేప పిల్లలు

కౌంటర్ల వద్ధ వందల సంఖ్యలో జనం చేప పిల్లల కోసం ఒకరిపై ఒకరు పడటంతో తోపులాట జరిగింది.

బత్తిని కుటుంబం

బత్తిని కుటుంబం

ఫలితంగా పలువురి చేతుల్లోని చిన్నారులు అదుపు తప్పి పడిపోవటంతో స్వల్ప గాయాలయ్యాయి.

శంఖం పూరించిన బత్తిని సోదరులు

శంఖం పూరించిన బత్తిని సోదరులు

తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణతో పాటు దేశ, విదేశాల నుంచి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో ఎగ్జిబిషన్‌గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.

చేపమందు పంపిణీ

చేపమందు పంపిణీ

జనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. ముందు చూపుతో జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

చేపమందు పంపిణీ

చేపమందు పంపిణీ

ప్రసాద పంపిణీ సజావుగా ప్రశాతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు.

చేపమందు

చేపమందు

ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.

చేప మందు

చేప మందు

చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఏలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు చేశారు.

చేప ప్రాదం పంపిణీ

చేప ప్రాదం పంపిణీ

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో లోపలికి వెళ్లేటపుడు పోలీసులు క్షణంగా తనీఖీ చేసిన తరువాత అనుమతిస్తున్నారు.

రోగుల బారులు

రోగుల బారులు

చేప ప్రసాదం కోసం వచ్చేవారి సౌకర్యార్థం తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో 40 కౌంటర్లను ఏర్పాటుచేసి దాదాపు లక్షా 30 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచిన్నట్లు మత్స్య శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్ సరళ తెలిపారు.

తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణతో పాటు దేశ, విదేశాల నుంచి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో ఎగ్జిబిషన్‌గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. జనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. ముందు చూపుతో జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రసాద పంపిణీ సజావుగా ప్రశాతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు.

చేప పిల్లలను రూ. 15 రూపాయలకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుండి కూడా చేప పిల్లలను తీసుకువచ్చినట్లు వారు వివరించారు. సోమవారం, మంగళవారం రోజు చేప ప్రసాదం సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అదనంగా చేప పిల్లలను పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఎగ్జిబిషన్ మైదానానికి చేప ప్రసాదం కోసం ఆదివారం నుండే వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు విచ్చేశారు. ఎండలు అధికంగా ఉండటంతో చేప ప్రసాదం తీసుకునేవారు సేద తీర్చుకునేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు. కాగా, చేప మందు పంపిణీ కార్యక్రమం మంగళవారం రాత్రి వరకు కొనసాగనుంది.

English summary
Thousands of asthma patients availed the 'fish prasadam' on Monday, a yellow herbal paste tucked inside the mouth of live murrel fishes, which they believe would help cure the disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X