టీఆర్ఎస్ భవన్‌కు అదే బలం: సుందరీకరణ పనుల్లో కేసీఆర్ ఇలా

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులన్నీ వాస్తు ప్రకారం జరగాలని సూచించారు.

సుందీకరణ పనుల పరిశీలన

సుందీకరణ పనుల పరిశీలన

తెలంగాణ భవన్‌లో వెయ్యి మందికి సరిపోయే ఏసీ హాల్, గ్రీన్ టాయ్‌లెట్లు, ఆర్వో ప్లాంట్లు, బలమైన సెక్యూరిటీ వ్యవస్థ, భవన్ చుట్టూ రోడ్డు, పెయింటింగ్, తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ అలంకరణలు, లైటింగ్, పార్కింగ్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. వీటిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణభవన్‌కు వచ్చారు. ఏసీ హాల్‌ను, తన గదిని, మీడియా గదిని, కమ్యూనికేషన్ సెంటర్‌ను చూశారు.

ఇలా ట్రాఫిక్‌కు చెక్

ఇలా ట్రాఫిక్‌కు చెక్

తెలంగాణ భవన్ ముందున్న వర్షపు నీటికాలువ పక్కనున్న స్థలంలోనుంచి రోడ్డును మెయిన్‌రోడ్డుకు కలుపాలని, నీటికాలువ వెంట ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వరకు రోడ్డు వేయాలని కేసీఆర్ సూచించారు. భవన్ పక్కనున్న పోలీసుల భూమిని కలుపుతూ రోడ్ నంబర్ 12కు రోడ్డు వేయడంద్వారా ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని సీఎం సూచించారు.

వాస్తు ప్రకారమే..

వాస్తు ప్రకారమే..

కాగా, తెలంగాణ భవన్‌లో గార్డెన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గార్డెన్ కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తు కోసం కేసీఆరే స్వయంగా కొన్ని మొక్కలను ఈ గార్డెన్లో నాటించారు. తైవాన్‌కు చెందిన ‘లక్కీ ఫికస్', ఇటలీ నుంచి తెప్పించిన ఓలైవ్ ట్రీ, ఇతర ఆకర్షణీయమైన చెట్లు ఈ గార్డెన్లో ఉన్నాయి. వాస్తు ప్రకారమే ఈ మొక్కలను నాటించడం గమనార్హం.

రూ.2కోట్లతో మెరుగులు

రూ.2కోట్లతో మెరుగులు

ఆగస్టు 14, 2006లో తెలంగాణ భవన్‌ను తన మంచి స్నేహితుడైన పిట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) నేత ఎస్ రామదాస్ తో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. అప్పట్నుంచి ఎలాంటి సుందరీకరణ పనులు జరలేదు. దీంతో మరోసారి కేసీఆర్.. తెలంగాణపై దృష్టి సారించి మెరుగులు దిద్దుతున్నారు. 40వేల స్క్వేర్ ఫీట్ల భవనానికి రూ. 2కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు.

నేతలకు సూచనలు

నేతలకు సూచనలు

భవన్ ముందున్న వర్షపు నీటికాలువ మీద చిన్న బ్రిడ్జి కట్టాలని చెప్పారు. సుందరీకరణ వివరాలను మేయర్ బొంతు రామ్మోహన్ సీఎంకు వివరించారు. సీఎం వెంట వచ్చిన వారిలో మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్‌రావు, టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ సుభాష్‌రెడ్డి, వాస్తుశాస్త్రవేత్త సుద్దాల సుధాకర్‌తేజ తదితరులున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister and Telangana Rashtra Samithi (TRS) president K Chandrashekar Rao on Tuesday visited, the party office, Telangana Bhavan and inspected the renovation works and gave several suggestions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి